Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తెలంగాణ ప్రభుత్వం శుభవార్త…రైతు భరోసా నిధులు జమ

  • రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ
  • మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి
  • సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని మంత్రులకు సూచన

రైతు భరోసా నిధులు జమ షురూ

మొదటి రోజు 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల

జిల్లాల వారీగా 2 ఎకరాల వరకు రైతు భరోసా లబ్ధిదారుల వివరాలు

41.25 లక్షల మంది రైతులకు గాను రూ.2,350 కోట్ల రూపాయలు జమ.

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతునేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి 70,11,984 మంది అన్నదాతలకు డబ్బులు జమ చేశారు. రైతులు ఫోన్లు చెక్ చేసుకోవాలని, టింగ్ టింగ్మంటూ డబ్బులు పడ్డట్లు మేసేజ్లు వస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములన రైతులందరికీ రైతు భరోసా

రైతుకు ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసా..!

9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ.

వారం రోజుల్లో అందరికీ జమ అవుతాయని CM రేవంత్ రెడీ స్పష్టం చేశారు.

నాగులవంచ రైతు వేదిక లో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ లో
రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల ప్రసంగాలతోపాటు వ్యవసాయ శ్రాస్త్ర వేత్తల సూచనలను శ్రద్ద గా విన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నల్లమోతు శేషగిరిరావు, మండల్ తాసిల్దార్ కూరపాటి అనంతరాజు ఏఈఓ లు కళ్యాణి , కార్తీక్ లు, నాగులవంచ, సీతంపేట , తిమ్మినేని పాలెం, చిన్నమండవ, తిరుమలాపురం, పాతర్లపాడు గ్రామాల రైతులు పాల్గొన్నారు.i

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తను అందించింది. రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయనుంది. ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా ముఖ్యమంత్రి చర్చించారు. జిల్లా నేతలతో ఇన్‌ఛార్జ్ మంత్రులు సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు.

వైద్య కళాశాలలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న 34 వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల రాష్ట్రంలోని 26 వైద్య కళాశాలల్లో ఉన్న సౌకర్యాలపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాష్ట్రంలోని పలు మెడికల్ కళాశాలల్లో సదుపాయాల కొరత ఉందని గుర్తించిన జాతీయ వైద్య మండలి, ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)లను ఈ నెల 18న ఢిల్లీకి రావాలని ఆదేశించింది. సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్ కూడా వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొనాలని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కళాశాలల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసి, నివేదిక సమర్పించడానికి అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.

ఆయా కళాశాలల్లో అవసరమైన అన్ని వసతులను రాబోయే మూడేళ్లలో సమకూర్చాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, అనుమతుల వివరాలను తనకు అందజేస్తే, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో మాట్లాడి వాటిని త్వరితగతిన మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటానని రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ భాషను ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా నేర్పించాలి. జపాన్‌లో మన నర్సింగ్ సిబ్బందికి మంచి డిమాండ్ ఉంది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని సూచించారు. వైద్య, విద్య శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రతి నెలా మూడో వారంలో తప్పనిసరిగా సమీక్షా సమావేశం నిర్వహించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

Related posts

మయోనైజ్ పదార్థంపై తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం

Ram Narayana

తెలంగాణలో కొత్త ఈవీ పాలసీ… రేపటి నుంచే!

Ram Narayana

ఆంధ్రా వాళ్ళ డబ్బులతోనే కేసీఆర్ పార్టీపెట్టారు … రేవంత్ తీవ్ర విమర్శలు

Drukpadam

Leave a Comment