Kavitha
తెలంగాణ వార్తలు

రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్సీ కవిత హర్షం

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
  • తెలంగాణ కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతించిన ఎమ్మెల్సీ కవిత
  • చట్ట సవరణ తర్వాతే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం
  • ఇది బీసీల విజయమని అభివర్ణించిన కవిత
  • తెలంగాణ జాగృతి పోరాట ఫలితమేనని వెల్లడి
  • వెంటనే చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచన

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. ఈ మేరకు గురువారం ఆమె ‘ఎక్స్’ వేదికగా తన స్పందనను తెలియజేస్తూ ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాన్ని సవరించి బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ వైఖరిని ఆమె ప్రశంసించారు. ఈ దిశగా అవసరమైన చర్యలను ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని ఆమె కోరారు. ఈ నిర్ణయం తెలంగాణలోని బీసీల విజయమని కవిత అభివర్ణించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ జాగృతి సంస్థ మొదటి నుంచి బలంగా డిమాండ్ చేస్తోందని, కేబినెట్ తాజా నిర్ణయం తమ పోరాటానికి లభించిన స్పష్టమైన విజయమని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కవిత జై బీసీ, జై జాగృతి అనే నినాదాలను తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు.

Related posts

రేవంత్ రెడ్డి లక్ష్యాలు విన్నాక ఛైర్మన్ పదవిని తిరస్కరించలేకపోయా: ఆనంద్ మహీంద్రా

Ram Narayana

రాజ్యసభ అభ్యర్థులపై ఉత్కంఠ.. బుధవారం ఢిల్లీకి సీఎం రేవంత్…

Ram Narayana

అడ్డగోలు అవినీతి …ఆపై కటకటాలపాలు…

Ram Narayana