హైద్రాబాద్ వార్తలు

చందానగర్ ఖజానా జువెలర్స్ చోరీ కేసులో పురోగతి!

  • ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • రెండు బైక్ లపై పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు
  • వీరు ప్రయాణిస్తున్న బైక్ లు కూడా దొంగిలించినవే

హైదరాబాద్ చందానగర్ లో సంచలనం సృష్టించిన ఖజానా జువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు కొంత పురోగత సాధించారు. పటాన్ చెరు రోడ్ పై వెళుతున్న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురిని పట్టుకున్నారు. వీరంతా రెండు బైక్ లపై పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. 

ముఖాలకు మాస్క్ లు, తలకు క్యాప్ లు, చేతులకు గ్లౌజులు ధరించి ప్రయాణిస్తుండటంతో వీరి కదలికలు పోలీసులకు అనుమానం కలిగించారు. వీరు ప్రయాణిస్తున్న బైకులు కూడా దొంగిలించినవేనని పోలీసులు గుర్తించారు. ఈ ఆరుగురిని పోలీస్ స్టేషన్ కు తరలించి, వారిపై కేసు నమోదు చేశారు. ఈ దోపిడీ వెనుక ఉన్న వ్యక్తల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.  

Related posts

హైడ్రా పై సోషల్ మీడియాలో వ్యతిరేకత కనిపిస్తుందన్న కమిషనర్ రంగనాథ్

Ram Narayana

హైదరాబాద్ పాతబస్తీలో రౌడీ షీటర్ దారుణ హత్య!

Ram Narayana

హైద‌రాబాద్‌లో శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో అప‌శ్రుతి.. ఐదుగురి మృతి!

Ram Narayana