స్థానిక సంస్థల ఎన్నికలు ..కోర్ట్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు
హాజరైన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్. డిప్యూటీ సీఎం భట్టి
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ ,పొంగులేటి , వాకాటి
పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ …
స్థానికసంస్థల రిజర్వేషన్లు , సుప్రీం కోర్ట్ లో లభించిన ఊరట, హైకోర్టు ముందు ఉన్న విచారణ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , వాకాటి శ్రీహరిలతో సమాలోచనలు జరిపారు … సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు .. సుప్రీం కోర్ట్ వ్యాఖ్యల నేపథ్యంలో బాల్ హైకోర్టు లో ఉన్నందున బుధవారం కోర్టులో జరగనున్న విచారణ ప్రభుత్వ నుంచి ఇవ్వ వాల్సిన వివరణపై కూడా వారు చర్చించినట్లు సమాచారం …హైకోర్టు కూడా ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఏమైనా ఉంటె తర్వాత రండి అని ఫిర్యాదు దారులను కోరే అవకాశం కూడా ఉండవచ్చునని న్యాయనిపుణులు కూడా అభిప్రాయపడుతున్న సందర్భంలో తమకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది …దీంతో కోర్ట్ నిర్ణయంపై ఆసక్తి నెలకొన్నది ..
ఎన్నికలు పక్కా.. అయితే ప్లాన్ ‘A’, లేదంటే ‘B..!!
ఏదేమైనా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బిసిలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో రేపు విచారణ జరగనుండగా న్యాయ నిపుణులు, మంత్రులు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తమ నిర్ణయ ఉద్దేశం, గత తీర్పులను కోర్టుకు వివరించాలని లాయర్లకు సూచించారు. జిఓను తోసిపుచ్చితే ఆదేశాలు పాటిస్తామని హైకోర్టుకు విన్నవించాలన్నారు. ఇలా అయితే పార్టీపరంగా 42% రిజర్వేషన్లతో (Plan:B) ఎన్నికలకు వెల్ధామని తెలిపారు.

