అనర్హుల పెన్షన్లు తొలగించాలి: సీఎం రేవంత్ రెడ్డి
అనర్హులు స్వచ్చందంగా తమ పెన్షన్లు వదులుకోవాలి
గ్రామసభలు పెట్టి అర్హులకు పెన్షన్లు
సీఎం రేవంత్ రెడ్డి చేసే నిర్ణయాలు కఠినంగా అనిపించినా వాటిలో అర్ధం పరమార్థం ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి…హైడ్రా విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయంలో మొదట ప్రసంశలు వచ్చిన తర్వాత పేదల ఇళ్లను తొలగిస్తున్నారని అభిప్రాయాలతో వ్యతిరేకత వస్తుంది …అయినప్పటికీ వెనకడుగు వేయకుండా దానిని కొనసాగిస్తున్నారు ..ఇప్పుడు పేదలకు ఇచ్చే పెన్షన్ల విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించు కున్నారు ..వాస్తవంగా అనేకమంది అనర్హలు పెన్షలు పొందుతున్నారు …దానిపై ప్రభుత్వానికి సమాచారం ఉంది …నిజమైన పేదలకు పెన్షలు అందాలనే సంకల్పంతో చేస్తే మంచిదే ఏది చేసిన నిజమైన లబ్ధిదారుడికి పథకం అందాలి. సీఎం తీసుకుంటున్న చర్యలు కొంతరికి నచ్చకపోయినా అర్హులను గుర్తించి ఇస్తే మంచిదే ..
వైద్యుల నుంచి తప్పుడు సర్టిఫికెట్లతో కొంత మంది దివ్యాంగుల పేరుతో పెన్షన్లు తీసుకోవడాన్ని అరికట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం స్వాగతించదగ్గదే …
ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు పెన్షన్లు ఇవ్వడంతో పాటు, అనర్హులను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు
సీఎం ఆదేశాలు ఇచ్చారు. అనర్హులు స్వచ్ఛందంగా తమ పెన్షన్లను వదులుకోవాలని సీఎం సున్నితంగా హెచ్చరించారు. లేకపోతే కచ్చితంగా చర్యలు తీసుంటామని హెచ్చరించారు.