ఆంధ్రప్రదేశ్

ఏపీకి పెట్టుబడుల వేటలో సీఎం చంద్ర‌బాబు,లోకేష్ లు..

  • ఏపీకి పెట్టుబడుల వేటలో సీఎం చంద్ర‌బాబు,లోకేష్ లు
  • ఇప్పటికే ఆస్ట్రేలియా లో లోకేష్ పర్యటన …
  • దుబాయ్, అబుదాబి, యూఏఈలో పర్యటించనున్న సీఎం
  • విశాఖ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడుల సేకరణే లక్ష్యం
  • రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ సహా పలు రంగాలపై దృష్టి
  • సీఎంతో పాటు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి కూడా పయనం
  • ఇప్పటికే సింగపూర్, దావోస్‌లో పర్యటించిన చంద్రబాబు
  • ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ లు తీవ్ర కసరత్తు చేస్తున్నారు …ఇందుకోసం లోకేష్ ఐదు రోజుల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లగా , సీఎం చంద్రబాబు దుబాయ్, అబుదాబి, యూఏఈలో పర్యటించనున్నారు ..విశాఖ లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడుల సేకరణే లక్ష్యంగా పర్యటనలు జరుపుతున్నారు …

విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు. విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించేందుకు ఆయన మంగళవారం నుంచి దుబాయ్, అబుదాబి, యూఏఈలలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను వివరించి, పారిశ్రామికవేత్తలను ఏపీకి తీసుకురావడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.

ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ప్రధానంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్నోవేషన్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. ఈ మేరకు పలువురు ప్రముఖ పెట్టుబడిదారులతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే ఈ పర్యటనలు చేపడుతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ముఖ్యమంత్రితో పాటు ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే పలు కీలక శాఖలకు చెందిన ఉన్నతాధికారుల బృందం కూడా పాల్గొంటోంది. కాగా, రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ఇప్పటికే సింగపూర్, దావోస్ వంటి ప్రాంతాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను కలిశారు. మరోవైపు మంత్రి నారా లోకేశ్‌ కూడా ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Related posts

హైడ్రా… బుడమేరులో ఆక్రమణలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు…

Ram Narayana

సిపిఐకి భారీ షాక్ …కొత్తగూడెంలో సిపిఐ పార్టీకి కౌన్సిలర్ల గుడ్ బై

Ram Narayana

మంత్రివర్గం ఆమోదం లేకుండానే కూటమి ప్రభుత్వం అప్పులు.. బుగ్గన ఫైర్

Ram Narayana