Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఆరెస్సెస్ కార్యకలాపాలపై ఆంక్షలు.. సిద్ధరామయ్య ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు!

  • ఆరెస్సెస్ కార్యకలాపాలకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు
  • రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించిన హైకోర్టు
  • తదుపరి విచారణ 17వ తేదీకి వాయిదా

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాల వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆరెస్సెస్ తదితర సంస్థల కార్యకలాపాలకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేస్తూ సిద్ధరామయ్య ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు మంగళవారం మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నవంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.

ఆరెస్సెస్ ఏర్పడి వందేళ్లయిన నేపథ్యంలో భారీస్థాయిలో కవాతులు నిర్వహించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు సంస్థలు, సంఘాలు తమ కార్యకలాపాల కోసం ప్రభుత్వ మైదానాలు, రహదారులు, బహిరంగ ప్రదేశాలు, విద్యాసంస్థల ఆవరణలను వినియోగించుకోవాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది.

ఈ మేరకు అక్టోబర్ 18న కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగాలను ఆదేశించింది. అయితే రాష్ట్రంలో అరెస్సెస్‌ను నిషేధించే ఉద్దేశంతో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Related posts

అల్లు అర్జున్ ముఖం చూపించాకే చెకింగ్ క్లియరెన్స్ ఇచ్చిన ఎయిర్ పోర్టు సిబ్బంది!

Ram Narayana

పీఎఫ్ డబ్బు విత్‌డ్రా ఇప్పుడు చాలా ఈజీ.. మారిన నిబంధనలు ఇవే!

Ram Narayana

వాహ‌న‌దారుల‌కు తీపికబురు.. కేంద్రం కీలక ప్రకటన!

Ram Narayana

Leave a Comment