తెలంగాణ వార్తలు

మధ్యాహ్నం 12:15 గంటలకు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం…

  • శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రమాణ స్వీకారం
  • రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మంత్రి పదవి

అనేక తర్జన భర్జనలు ,ఊహాగానాలకు తెరదించుతూ ముస్లిం మైనార్టీ కోటా నుంచి మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు ఏఐసీసీ ఆమోద ముద్ర వేయడంతో ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయింది ..రేపు మధ్యాహ్నం 12 .15 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ..మరి కొంతమంది ఆశావహులు ఉన్న జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో హడావుడిగా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి…బీజేపీ ఎన్నికల సందర్భంలో ముస్లిం ఓట్లను గంప గుత్తగా దండుకునేందుకు మంత్రి పదవి ఇస్తున్నారని అందువల్ల ప్రమాణ స్వీకారాన్ని ఆపాలని ఎన్నికల కమిషన్ కు కోరింది ..మరో పక్క సొంతపార్టీలో తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు ..ఆయన తన ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుంది ..

ప్రభుత్వంలో గ్రేటర్ పరిధిలో ఆయన తొలి మంత్రి కాబోతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏఐసీసీ నుంచి ఆమోదం రావడంతో, రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తెలంగాణలో 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా, ప్రస్తుతం 15 మంది ఉన్నారు. మరో ముగ్గురికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కోదండరాంతో పాటు అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసినప్పటికీ, గవర్నర్ ఆమోదించవలసి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

Related posts

మరి కొద్దీ గంటల్లోనే ఫలితం …జూబ్లీహిల్స్ పై బెట్టింగులు

Ram Narayana

ఏఐజీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డికి అరుదైన గౌరవం..

Ram Narayana

రాష్ట్రంలో అప్పులపై బీఆర్ యస్ ది తప్పుడు ప్రచారం ..డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

Ram Narayana