ఆంధ్రప్రదేశ్

ప్రపంచ తెలుగు మహాసభలకు తేదీలు ఖరారు…

  • జనవరిలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు
  • గుంటూరులో ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు
  • ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో వేడుకలు
  • తెలుగు వైభవ పురస్కారాలకు ముఖ్య అతిథిగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి
  • గవర్నర్‌ను ఆహ్వానించిన గజల్ శ్రీనివాస్

ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 2026 జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు గుంటూరు వేదికగా ఈ మహాసభలు నిర్వహించబడతాయి. ఇందులో భాగంగా జనవరి 4న జరిగే “తెలుగు వైభవ పురస్కారాల” ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యేందుకు అంగీకరించారు.

ఈ మేరకు పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ హైదరాబాద్‌లో గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మహాసభలకు ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటానని ఇంద్రసేనారెడ్డి హామీ ఇచ్చారన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, మాతృభాష అయిన తెలుగును నిలబెట్టుకోవడం ప్రతి తెలుగు వ్యక్తి బాధ్యత అని గుర్తుచేశారు. కాగా, గుంటూరులోని అమరావతి శ్రీసత్య సాయి స్పిరుచ్యువల్‌ సిటీ ప్రాంగణంలో (హైవే) ఉన్న నందమూరి తారకరామారావు వేదికపై ఈ మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Related posts

ముందే మరణం తెలుసుకున్న డాక్టర్ …తన చావు ఏర్పాట్లను తానే చేసుకున్నఅరుదైన ఘటన…

Drukpadam

పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు కొత్త ఎస్పీలు వీరే!

Ram Narayana

ఫుల్లుగా మందుకొట్టి విమానం ఎక్కిన యువతి.. జార్జియా అనుకుని ఇండియాకు!

Ram Narayana