Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని ప్రకటించిన కవిత!

  • కమిటీ వివరాలను వెల్లడించిన జాగృతి అధ్యక్షురాలు కవిత
  • అధ్యక్షుడిగా మోరం వీరభద్రరావు నియామకం
  • ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్‌కు బాధ్యతలు
  • టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతన కమిటీకి సూచన

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంస్థాగత నియామకాలపై దృష్టి సారించారు. జాగృతి అనుబంధ విభాగమైన “జాగృతి టీచర్స్ ఫెడరేషన్” నూతన కార్యవర్గాన్ని ఆమె ప్రకటించారు. ఈ మేరకు జాగృతి అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వివరాలను వెల్లడించారు.

నూతన కమిటీ అధ్యక్షుడిగా మోరం వీరభద్రరావును, ఉపాధ్యక్షుడిగా బుర్ర రమేష్ గౌడ్‌ను నియమించారు. ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్, కోశాధికారిగా ఘనపురం దేవేందర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నియామకాలన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయని కవిత స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సమాజ అభ్యున్నతి, నవ తెలంగాణ నిర్మాణ లక్ష్యంతో తెలంగాణ జాగృతి పనిచేస్తోందని తెలిపారు. కొత్తగా నియమితులైన బాధ్యులు విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపునకు ఫెడరేషన్ చురుకైన పాత్ర పోషించాలని ఆమె సూచించారు.

Related posts

రాహుల్ గాంధీ, ఖర్గేలకు కేటీఆర్ లేఖాస్త్రం…

Ram Narayana

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు జై కొట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారు: కేసీఆర్

Ram Narayana

ముస్లింల మద్దతు ఎప్పటికీ కాంగ్రెస్ కే వుంటుంది: తుమ్మల నాగేశ్వరరావు

Ram Narayana

Leave a Comment