మణుగూరులో కాంగ్రెస్ – బీఆర్ యస్ మధ్య పార్టీ ఆఫీస్ విషయంలో వార్ ..హైటెన్షన్
బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి..ఫర్నిచర్‌ను కార్యాలానికి నిప్పు
రేగా కాంతారావు కాంగ్రెస్ లో ఉండగా కాంగ్రెస్ కార్యాలం …బీఆర్ యస్ లో చేరిన తర్వాత బీఆర్ యస్ ఆఫీస్
రేగా సొంత ప్రాపర్టీ అంటున్న బీఆర్ యస్ నేతలు
తాను కాంగ్రెస్ కార్యాలానికి స్థలం ఇచ్చానంటున్న స్థల యజమాని

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్ -బీఆర్ యస్ మధ్య పార్టీ ఆఫీస్ విషయంలో వార్ నడుస్తుంది ..ఇది ఇప్పటి వార్ కాదు ..రేగా కాంతారావు 2018 లో పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు…తిరిగి బీఆర్ యస్ అధికారంలోకి రావడంతో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ఆయన పార్టీ ఫిరాయించారు . ఆయన కాంగ్రెస్ లు ఉండగా కాంగ్రెస్ కార్యాలయంగా నిర్మించిన భవనాన్ని పార్టీ మారిన వెంటనే బీఆర్ యస్ భవనంగా మార్చారు..నాడు కాంగ్రెస్ దీనిపై అభ్యంతరం పెట్టినప్పటికీ అధికారంలో బీఆర్ యస్ ఉండటంతో సాధ్యం కాలేదు …ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది .దీంతో తిరిగి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆక్రమించింది …అయితే అది ప్రవేట్ ప్రోపర్టీనా లేక కాంగ్రెస్ పార్టీదా …? అనేది తేలాల్సి ఉంది ..
కాంగ్రెస్ ఒక్కసారిగా బీఆర్ యస్ భవనంపై దాడిచేయడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలిసుల జోక్యంతో కొంత శాంతించినప్పటికీ హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది ..
మణుగూరులోని బీఆర్ఎస్ కార్యాలయంలోకి ప్రవేశించిన కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు నిప్పు పెట్టారు. అంతేకాకుండా, కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బ్యానర్లను చించివేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రభుత్వానికి చెందిన స్థలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించారని కాంగ్రెస్ నేతలు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. ఖమ్మం జిల్లాలోని మణుగూరులో ఆదివారం ఉదయం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణాత్మక పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
తాజాగా కాంగ్రెస్ కార్యకర్తలు మణుగూరులోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీలను చించివేయడంతో పాటు, ఫర్నీచర్‌ను తగలబెట్టారు. ఆఫీసు ప్రాంగణం అంతా పొగలతో కమ్ముకుంది. అనంతరం కాంగ్రెస్ జెండాను ఆఫీసుపై ఎగురవేశారు.
కాంగ్రెస్ నేతల ప్రకారం, “ప్రభుత్వ స్థలంలో అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించబడిందని” ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో, “అప్పటి ఎమ్మెల్యే పోలీసు బందోబస్తుతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించి గులాబీ రంగులు వేయించినట్లు” వారు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఉదయం కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగగా, పరిస్థితి వేడెక్కింది. ఆఫీసుపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తల చర్యలతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకొని, “సీఎం రేవంత్ రెడ్డి, మణుగూరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా” నినాదాలు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని, ఇరుపార్టీల మధ్య ఘర్షణలు జరగకుండా అదుపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి అక్కడ భారీగా పోలీసు బలగాలు మోహరించగా, పరిస్థితి నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు.కాంగ్రెస్, బిఆర్ఎస్, పార్టీ మధ్య ఘర్షణ ల నేపథ్యంలో 144 సెక్షన్ అమలు..పట్టణంలో భారీ పోలీస్ భద్రత ఏర్పాట్లు..ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే కేసులు నమోదు.
నేను కాంగ్రెస్ పార్టీకే స్థలం ఇచ్చాను… స్థలం ధాత పిల్లారీశెట్టి హరిబాబు
గతంలో మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి స్థలం ఇచ్చింది వాస్తవమే.. ఇచ్చిన స్థలంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు.. ఎప్పుడైనా ఇదే మాట చెబుతా. నాడు బట్టి విక్రమార్క గారితో కూడా ఇదే చెప్పాను
మణుగూరు పట్టణంలోని తెలంగాణ భవన్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం…వందల సంఖ్యలో తెలంగాణ భవన వద్దకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యాలయం లోని ఫర్నిచర్ అంతా బయటపడేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన నాయకులు కార్యకర్తలుకార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేని దుస్థితి
గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం….
రేగా కాంతారావు 2018 లో పినపాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.. అప్పుడు దాన్ని కాంగ్రెస్ కార్యాలయంగా ఉపయోగించారు గెలిచిన తర్వాత బీఆర్ యస్ లోకి ఫిరాయించారు .. తిరిగి దాన్ని బీఆర్ యస్ కార్యాలయంగా మార్చారు…కాంగ్రెస్ అధికారంలోకి రావడం తో మళ్ళీ పార్టీ కార్యాలయం వివాదం తెర మీదకి వచ్చింది…. ఇది తమ పార్టీ కార్యాలయం అని రేగా కాంతారావు అక్రమంగా ఆయన పార్టీ మరి అధికార పార్టీ అండతో బీఆర్ యస్ భవనంగా మార్చారు ..
అది రేగా కాంతారావు ప్రవేట్ ఆస్తి అన్నట్టున్న ఎంపీ వద్దిరాజు,ఎమ్మెల్సీ తాతా మధు
మణుగూరు ఘటన ద్వారా కాంగ్రెస్ నీచ సంస్కృతిని 20 ఏళ్ళు వెనక్కి తీసుకువెళ్లిందని
రేగా కాంతారావు ప్రయివేటు ప్రాపర్టీని కొనుగోలు చేసి,అందులోనే నివాసం ఉంటూ, సగభాగాన్ని పార్టీ ఆఫీసుగా మార్చుకున్నారని అలంటి స్వంత ప్రాపర్టీ పై కాంగ్రెస్ గుండాలు దాడిచేసి ఆక్రమించి దాడికి తెగబడి ఫర్నీచర్ ను తగులబెట్టి తమ కార్యకర్తలను విచక్షణారహితంగా కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. జూబ్లీహిల్స్ సర్వే రిపోర్టులతో కాంగ్రెస్ పార్టీలో అసహనం పెరిగిందని వారు ధ్వజమెత్తారు…బీఆర్ఎస్ గద్దెపై కాంగ్రెస్ జెండాను పెట్టడం సిగ్గు చేటని విమర్శలు గుప్పించారు ..కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఆఫీసుపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు…
సిరిసిల్లలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ క్యాంపు ఆఫీసుపై,సిద్దిపేటలో హరీష్ రావు క్యాంపు ఆఫీసుపై, భువనగిరిలో పార్టీ కార్యాలయంపై దాడులు చేశారని హోమ్ మంత్రి భాద్యతలు నిర్వహిస్తున్న సీఎం రేవంత్ పూర్తిగా వైఫల్యం చెందారని విరుచుకపడ్డారు ..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలకు నేర్పుతున్నది ఇదేనా? అని అన్నారు.శాంతియుతంగా ఉన్న
ఖమ్మం జిల్లాలో అలజడి సృష్టిస్తున్నారని ఎప్పుడు అధికారంలో వారే ఉండరని గుర్తుంచుకోవాలని అన్నారు ..
మద్దతు విషయంలో సిపిఎం పునరాలోచన చేసుకోవాలి ..
సీపీఏం రాష్ట్ర నాయకుడు రామారావు హత్యకు కాంగ్రెస్ నేతలే కారణమంటూ బలంగా వాదనలు వినిపిస్తున్నందున జూబ్లీహిల్స్ లో మద్దతు విషయంలో సీపీఏం పునరాలోచన చేసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమైనా కూడా బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుంది, కేసీఆర్ కు బహుమతిగా ఇస్తాం

