Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

మోదీపై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ పెళ్లి ఎప్పుడంటూ కేంద్రమంత్రి చురక

  • కుమారుడి పెళ్లి అన్నట్లుగా మోదీ బీహార్‌లో తిరుగుతున్నారని ఖర్గే ఎద్దేవా
  • మోదీపై ఖర్గే వ్యాఖ్యలపై మండిపడుతున్న బీజేపీ నేతలు
  • రాహుల్ గాంధీ పెళ్లైతే పిలవండి.. తప్పకుండా హాజరవుతామన్న గిరిరాజ్ సింగ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్‌లో కుమారుడి పెళ్లికి తిరుగుతున్నట్లుగా పర్యటిస్తున్నారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ గట్టిగా బదులిచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వివాహం ఎప్పుడో చెప్పాలని ఆయన ఎద్దేవా చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాజాపకర్‌లో ఖర్గే మాట్లాడుతూ, పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఏదైనా ఎన్నిక జరిగినా ప్రధాన మంత్రి మోదీ బిజీగా ప్రచారం చేస్తూనే ఉంటారని, ఇప్పుడు బీహార్‌లో కూడా కుమారుడి పెళ్లి మాదిరిగా తిరుగుతున్నారని విమర్శించారు. ప్రజలు ఎన్నిసార్లు కేవలం మోదీ ముఖం చూసి ఓట్లు వేస్తారని ఆయన ప్రశ్నించారు.

ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఖర్గే గారూ, మీ యువరాజు రాహుల్ గాంధీ వివాహం ఎప్పుడైనా జరిగితే మాకు ఆహ్వానం పంపండి. ఆ వివాహానికి మేము తప్పకుండా హాజరవుతాం” అంటూ గిరిరాజ్ సింగ్ వ్యంగ్యంగా అన్నారు. బీహార్‌లో 6వ తేదీన మొదటి దశ పోలింగ్ జరగనుంది. మొదటి విడతకు మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది.

Related posts

కాంగ్రెస్ కూడా తప్పులు చేసింది: రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Ram Narayana

బానిస మనస్తత్వాలు… కుంభమేళా విమర్శకులపై మోదీ ఫైర్!

Ram Narayana

మహారాష్ట్ర …అహేరీ నియోజకవర్గంలో తండ్రీకూతురు మధ్య ఆసక్తికర పోటీ..!

Ram Narayana

Leave a Comment