Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎలక్షన్ కమిషన్ వార్తలు

రాహుల్ గాంధీ ఓటు చోరీ విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన ఎన్నికల సంఘం…

  • హర్యానాలో ఓటు చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణలు
  • ఎస్ఐఆర్‌ను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఈసీ అని ప్రశ్న
  • హర్యానా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు రాలేదని వెల్లడి

ఓట్ల చోరీ అంశంపై ‘హైడ్రోజన్ బాంబు’ పేరిట కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించగా, కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిస్పందించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని, బ్రెజిల్ మోడల్‌కు కూడా ఇక్కడ ఓటు ఉందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఈసీ స్పందించింది.

రాహుల్ గాంధీ ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? చెప్పాలని ఈసీ ప్రశ్నించింది. గత ఏడాది హర్యానాలో ఎన్నికలు జరిగాయని, వాటికి ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని తెలిపింది. పోలింగ్ స్టేషన్‌లలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.

Related posts

కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్‌పై ఎన్నికల సంఘం బదలీ వేటు

Ram Narayana

ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ… జానారెడ్డి నామినేషన్ తిరస్కరణ

Ram Narayana

ఓటర్ కార్డు ఓటుకు గ్యారంటీ కాదు.. ఢిల్లీ ఈసీ వ్యాఖ్య!

Ram Narayana

Leave a Comment