ఆంధ్రప్రదేశ్

నిన్న అంబటి నేడు జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ వరస దాడులు …జోగి రమేష్ ఫైర్

“ఏం తప్పు చేశానని నా ఇంటిపై దాడి చేశారు? నా ఇంటిపైకి గంజాయి బ్యాచ్‌ను పంపి పెట్రోల్ బాంబులు వేయిస్తారా?” అంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో, నా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం” అని ప్రత్యర్థులను గట్టిగా హెచ్చరించారు. తన నివాసంపై జరిగిన దాడి ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. “ఎప్పుడూ మీరే అధికారంలో ఉంటామని కలలు కంటున్నారేమో. నీ పిల్ల చేష్టలు, క్షణికానందం మానుకో” అని జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తన ఇంటిపై దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు, పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. నన్ను ఏం చేయాలనుకున్నారో ఏమో… నన్ను మట్టుబెట్టాలనుకున్నారా… రాళ్లు, కర్రలు, పెట్రోలు బాంబులతో నా ఇంటిపై దాడి చేశారు అని వెల్లడించారు.

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. మంత్రి నారా లోకేశ్ పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఆయన ఇంటిపై దాడికి దిగారు. ఈ క్రమంలో రాళ్లు రువ్వడంతో పాటు పెట్రోల్ బాంబులు కూడా విసిరినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో ఇంటికి పాక్షికంగా నిప్పు అంటుకుంది. ఈ దాడి జరిగిన సమయంలో జోగి రమేశ్ తండ్రి, భార్య, కుమారుడు కూడా నివాసంలోనే ఉన్నట్టు తెలుస్తోంది.

లోకేష్.. నీ పిల్ల చేష్టలకు, నీ వెర్రి చేష్టలకు నేను భయపడను

నారా లోకేష్, చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి జోగి రమేష్

నీ అయ్య, నువ్వు, నన్ను జైలులో పెట్టి రాక్షసానందం పొందింది చాలక.. నా ఇంటి మీద పెట్రోల్ బాంబుతో దాడి చేస్తారా

సిగ్గు, శరం వదిలేసి సన్నాసుల్లాగ తయారయ్యారు.. ఏం పనులురా ఇవి, పనికి మాలినోడా

నేను ఏం చేశానని మా ఇంటిపై దాడి చేశారు?

మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరమని లోకేష్ గుర్తు పెట్టుకోవాలి – వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్

Related posts

షర్మిల పాదయాత్రకు కోర్ట్ గ్రీన్ సిగ్నల్ …వ్యక్తిగత దూషణలకు నో …

Drukpadam

మ్యాంగో జ్యూస్ వెంటనే తీసుకురాలేదని కోడలిని ఇంటి నుంచి గెంటేశారు!

Drukpadam

డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీ కార్డులు పాతపద్ధతిలోనే జారీ!

Drukpadam