ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ నేతలతో సజ్జల, బొత్స కీలక భేటీ…

  • అంబటి అరెస్ట్ తో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు
  • తిరుమల ప్రతిష్ఠ దిగజార్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న సజ్జల, బొత్స
  • వాప్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన

ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించాయి. ఈ క్రమంలో రాంబాబుపై కేసు నమోదు కావడం… కోర్టు ఆయనకు రిమాండ్ విధించడం తెలిసిందే. తాజాగా, మరో మాజీ మంత్రి జోగి రమేశ్ పై కూడా కేసు నమోదయింది. 

ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ నేతలతో పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఈ రెండు ఉమ్మడి జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, సమన్వయకర్తలు హాజరయ్యారు. ఇటీవల చోటు చేసుకుంటున్న అంశాలపై పార్టీ నేతలు ఎలా స్పందించాలనే అంశంపై సజ్జల, బొత్స సూచనలు చేశారు. 

తిరుమల ప్రతిష్ఠ దిగజార్చే విధంగా కూటమి వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా నేతలు అన్నారు. కూటమి ప్రభుత్వ ఆగడాలను నిలువరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వాస్తవాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీ నేతలకు భద్రత కల్పించేందుకు పోరాటం చేయాలని తెలిపారు.

Related posts

రెండున్నర గంటలపాటు సాగిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం

Ram Narayana

అధికారులపై పవన్ కళ్యాణ్ అసహనం…మాజీమంత్రి అంబటి సైటైర్లు !

Ram Narayana

చంద్రబాబు ఇంటికి వెళ్లిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు

Ram Narayana