ఎంటర్టైన్మెంట్ వార్తలు

NTR… ఈ మూడు అక్షరాలకు అర్థం చెప్పిన చిరంజీవి…

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2025’ కార్యక్రమంలో ఆయనకు ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని అందుకోవడంపై చిరంజీవి తన ఆనందాన్ని, కృతజ్ఞతలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

“చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు… తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు. ఎన్టీఆర్ అంటే… N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనం. తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడు. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా… తాను పోషించిన పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభావంతుడు. రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా, ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిది. అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ నాకు లభించడం, నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. 

ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులకు, అవార్డుల జ్యూరీకి చిరంజీవి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 

Related posts

హీరోలకు వందల కోట్లు ఎందుకు?.. టాలీవుడ్‌పై ఐబొమ్మ రవి తండ్రి తీవ్ర విమర్శలు

Ram Narayana

ఐఆర్ సీటీసీ ఆరు రోజుల అందమైన టూర్… వివరాలు !

Ram Narayana

రాజమౌళి, మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం.. ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు..

Ram Narayana