జాతీయ రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీ బీజేపీ ‘బీ-టీమ్’: కేరళ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్య…

కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ బీజేపీ ‘బీ-టీమ్’ అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి పోటీగా కాంగ్రెస్ పార్టీని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో శనివారం ఒక మీడియా సంస్థతో ముఖ్యమంత్రి మాట్లాడారు.

ఇటీవల కేరళలో పర్యటించిన రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రభుత్వంపై, పినరయి విజయన్‌పై విమర్శలు గుప్పించారు. దేశంలోని ప్రతిపక్ష నాయకులను కేంద్ర ఏజెన్సీలు అరెస్టు చేశాయని లేదా విచారణ జరిపాయని… కానీ కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ను మాత్రం ప్రశ్నించడం లేదని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై విజయన్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మెజారిటీ, మైనారిటీ అంటూ దేశంలో మతరాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి ఎలాంటి మతతత్వానికి అయినా వ్యతిరేకమే అన్నారు. మతతత్వ కార్యకలాపాలలో నిమగ్నమైన ఎవరి మద్దతును తాము కోరేది లేదని స్పష్టం చేశారు.

ఇటీవల ముగ్గురు సీపీఐ(ఎం) పార్టీకి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీ అండతో ఇండిపెండెంట్లుగా పోటీ చేయడంపై విజయన్ స్పందించారు. కొందరు పార్లమెంటుకు వెళ్లాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారని, కానీ వాళ్లు ఎంతోకాలంగా నిర్మించుకున్న రాజకీయ వారసత్వాన్ని పోగొట్టుకున్నారని అన్నారు. ప్రతిపక్షాలతో చేతులు కలిపి తమ పార్టీని దెబ్బతీయాలనుకుంటున్నారని విమర్శించారు.

Related posts

ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల చేసిన కాంగ్రెస్‌…కులగణన చేస్తామని హామీ

Ram Narayana

సచిన్ పైలట్ కు రాజస్థాన్ సీఎం గెహ్లాట్ మద్దతు

Ram Narayana

ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ను బయటకు పంపించాలి: ఆమ్ ఆద్మీ పార్టీ

Ram Narayana