Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మంలో టీఆర్ యస్ నుంచి భారీ క్రాస్ ఓటింగ్ …పార్టీ లో అంతర్మధనం

ఖమ్మంలో టీఆర్ యస్ నుంచి భారీ క్రాస్ ఓటింగ్ …పార్టీ లో అంతర్మధనం
-ఖమ్మం క్రాస్ ఓటింగ్ పై కేసీఆర్ ఆరా !
-క్రాస్ ఓటింగ్ కు భాద్యులెవరు అనే దానిపై ద్రుష్టి
-కాంగ్రెస్ కు ఉన్న ఓట్లకన్నా అదనంగా ఓట్లు
-తమకు 144 ఓట్లు అదనంగా వచ్చాయి అంటున్న కాంగ్రెస్
-జిల్లా రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం

-టీఆర్ యస్ లో క్రాస్ ఓటింగ్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు:తాతా మధు 

ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిశీలకులు ఊహించినట్లు గానే భారీ క్రాస్ ఓటింగ్ జరిగింది… టీఆర్ యస్ అభ్యర్థి తాతా మధు గెలిచినప్పటికీ పోలైన ఓట్లను చూసి అధికార టీఆర్ యస్ కూడా కంగు తిన్నది .గెలిచామని సంబరాలు జరుపుకుంటున్న తగ్గినా ఓట్లు వారిని వెంటాడుతున్నాయి. దీంతో టీఆర్ యస్ శ్రేణులు అంతర్మథనంలో పడ్డాయి. క్రాస్ ఓటింగు ఎలా జరిగింది. ఎక్కడనుంచి జరిగింది అనే విషయాలను కూపీ లాగుతున్నారు. నియోజకవర్గాలవారీగా లెక్కలు తీస్తున్నారు. టీఆర్ యస్ లో క్రాస్ ఓటింగ్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్సీ గా ఎన్నికైన తాతా మీడియా కు తెలిపారు. పార్టీ వల్లే పార్టీకి ద్రోహం చేయడంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని సీఎం నిర్ణయం మేరకు నడుచుకుంటామని తెలిపారు.    దీనిపై టీఆర్ యస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. ఎందుకు ఇలా జరిగింది దీనిపై సమగ్ర రిపోర్ట్ కావాలని కోరినట్లు తెలుస్తుంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల్లో టీఆర్ యస్ కు తిరుగులేని ఆధిక్యత ఉంది. పార్టీ గుర్తుపై గెలిచినా వారే 497 మంది ఉన్నారు. తరవాత కాలంలో జరిగిన పరిణామాల్లో వివిధ పార్టీలనుంచి చేరిన వారు 25 మంది నుంచి 30 మంది వరకు ఉన్నారు. వీరితోపాటు సిపిఐ ఓటర్లు 30 మంది కలిపి 550 పైచిలుకు ఓట్లు రావాల్సి ఉంది. కానీ టీఆర్ యస్ అభ్యర్థి తాతా మధు కు 480 ఓట్లు వచ్చాయి. ఆయన గోవా లో ఏర్పాటు చేసిన క్యాంపు లో 600 మందికి ఉన్నారని వారికీ తోడు వారి కుటుంబసభ్యులతో కలిపి 900 మందికి అక్కడ ఏర్పాట్లు చేశారు. తమ క్యాంపు కు వచ్చినవారు కూడా తమకు ఓట్లు వేయకపోవడంపై ఆతర్మధనం జరుగుతుంది. తేడా ఎక్కడ కొట్టింది. టీఆర్ యస్ లో ఎవరు కోవర్టులుగా పని చేశారు. చివరి రోజుల్లో ఫోన్లు సైతం అందుబాటులో లేకుండా చేసిన అన్ని ఓట్లు తేడా ఎందుకు వచ్చాయనే పోస్ట్ మార్టం జరుగుంది.

జిల్లా టీఆర్ యస్ అసమ్మతి గూడు కట్టుకొని ఉన్నదనేది ఈ ఎన్నిక నిరూపించింది. ప్రధానంగా మాజీల సహకారం లేదు . పైగా వారిని విశ్వాసంలోకి తీసుకోలేదు. వారిని సీఎం కేసీఆర్ తూలనాడాడని వారివల్ల జిల్లాలో పార్టీ దిగజారిపోతోంది ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. ఇందుకు తగ్గట్లుగానే మాజీలు ఈ ఎన్నికకు పూర్తిగా దూరంగా ఉండటం కూడా క్రాస్ ఓటింగ్ కు కారణమైందా? లేక కాంగ్రెస్ అభ్యర్థి ప్రలోభాలకు ఓటర్లు ఆకర్షితులైయ్యారా? లేక వారే కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా తమ శ్రేణులకు సందేశాలు పంపారా? అనే అనుమానాలు లేకపోలేదు .

ఈ ఎన్నిక ఖమ్మం జిల్లాలో ఉన్న టీఆర్ యస్ కుమ్ములాటలను బహిర్గతం చేసింది. ఇప్పటికైనా అందరిని కలుపుకుని పోకపోతే పుట్టిమునగటం ఖాయమనే సంకేతాలను ఇచ్చింది. అయితే అసమ్మతి వదులుగా ఉన్న వారిని బుజ్జగిస్తారా ? వదిలించుకుంటారా ? అనే ఆశక్తి నెలకొన్నది. ఏది ఏమైనా ఖమ్మం జిల్లా రాజకీయాలను ఈ ఎన్నిక మలుపు తిప్పుతుందనే దాంట్లో ఎలాంటి సందేహాలు లేవని రాజకీయపండితుల అభిప్రాయంగా ఉంది….ఏమి జరుగుతుందో చూద్దాం ….

Related posts

రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల జాబితాలో 5వ స్థానంలో ఏపీ…

Drukpadam

కరోనా సంక్షోభంపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి 47 మంది తెలుగు వైద్యుల లేఖ

Drukpadam

వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐకి సునీత న్యాయవాదుల సాయానికి కోర్టు ఓకే

Drukpadam

Leave a Comment