Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మిర్చిరైతులకు అండగా సిపిఎం :సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం!

మిర్చిరైతులకు అండగా సిపిఎం :సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం!
-మిర్చి రైతులకు పరిహారం పై ముఖ్యమంత్రి కేసిఆర్ స్పందించలి
ఎకరాకు లక్ష పరిహారంగా ఇవ్వాలి
-రాష్ట్రప్రభుత్వ వైఫల్యం వల్లనే రైతుల ఆత్మహత్యలు
కౌలు రైతులను ఆదుకోవాలి
-రైతు ఆత్మహత్య లను నివారించాలి
-సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

మిర్చిరైతులకు అండగా సిపిఎం ఉంటుందని , వారికీ పరిహారం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. . కొణిజర్ల మండలం లక్ష్మీపురం, పెద్ద రాంపురం లో వైరస్,తామర, పురగులతో నష్టపోయిన మిర్చి పంట ను సిపిఎం రాష్ట్ర బృందం పరిశీలించింది . ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ఈ ఏడాది మిర్చిపంట వేసిన రైతులు వైరస్ భారిన పడి పూర్తిగా నష్టపోయారని అందువల్ల చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే చరణ్యం అంటున్నారని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు అదిచేశాం ఇది చేశాం అంటున్న ముఖ్యమంత్రి వెంటనే మిర్చి రైతులను ఆదుకోవాలని అన్నారు. మిర్చివేసిన రైతులకు తక్షణమే ఎకరాకు లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం లో మిర్చి పంట వైరస్ తో పాటు గులాబీ,తామర పురగులతో దెబ్బ తిన్ని ఎకరాకు లక్ష రూపాయలు పైగా పెట్టుబడి ఖర్చు పెట్టి పంటలు తొలిగించి పరిస్థితి లో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని, ముఖ్యమంత్రి కేసిఆర్ వెంటనే స్పందించి మిర్చి రైతులు ఆత్మహత్యలను నివారించాలని అన్నారు . మిర్చి రైతులు కు అవసరమైన సలహాలు సూచనలు అందించడం లో రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యానవన శాఖ పూర్తిగా వైఫల్యం చెందాయని, సకాలంలో రైతులకు సలహాలు అందించి ఉంటే నష్టం తక్కువ గా ఉండేది అని అన్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతులకు జరిగిన నష్టం పకృతి వైపరిత్యాలు క్రింద పరిగణనలోకి తీసుకుని ప్రకృతి విపత్తు గా ప్రకటించి ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు, కౌలు రైతులు పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది అని కౌలు రైతు లకు అదనంగా కౌలు కూడా చెల్లించాలి అని డిమాండ్ చేశారు,ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయని రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు అని మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించే వరకు రైతులు జరుపుతున్న ఉద్యమం కు సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుంది అని, రాష్ట్ర వ్యాప్త ఉద్యమం గా సిపిఎం మిర్చి రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో భద్రాచలం మాజీ పార్లమెంటు సభ్యులు మిడియం బాబురావులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు తాళ్ళ పల్లి కృష్ణ, మండల కార్యదర్శి చెరుకు మల్లి కుటుంబరావు, మండల నాయకులు దొడ్డపనేని కృష్ణార్జున్ రావు, చింతపల్లి ప్రసాద్, హరిచంద్, జట్ల రవి, మిద్దె రామారావు, గాదె వెంకటరెడ్డి, దుగ్గినేని అజయ్, నంద్యా,యాలాద్రి రైతులు పాల్గొన్నారు

Related posts

ఆఫ్ఘనిస్థాన్‌లో మీడియాపై ఉక్కుపాదం.. 150కిపైగా సంస్థల మూత!

Drukpadam

ఆజాద్ అండ్ టీం ప్రచారం చేస్తానంటుంది…

Drukpadam

తెలంగాణ లో బీజేపీ జెండా ఎగరాలి ….బీజేపీ అగ్రనేత అమిత్ షా!

Drukpadam

Leave a Comment