Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పంజాబ్ క్రీడాకారిణికి మంత్రి కేటీఆర్ సాయం.. వ్యక్తిగతంగా రూ. 15 లక్షలు అందజేత!

పంజాబ్ క్రీడాకారిణికి మంత్రి కేటీఆర్ సాయం.. వ్యక్తిగతంగా రూ. 15 లక్షలు అందజేత!
-పుట్టుకతోనే మాటలు కోల్పోయిన మాలిక హండా
-చదరంగంలో జాతీయ స్థాయిలో అనేక పతకాలు
-కేంద్రం కూడా ఆదుకోవాలన్న కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. పుట్టుకతోనే మాటలు రాకుండా క్రీడలో విశేష ప్రతిభ కనబరిచిన పంజాబ్‌కు చెందిన చదరంగ క్రీడాకారిణి మాలిక హండాకు కేటీఆర్ వ్యక్తిగతంగా రూ. 15 లక్షల ఆర్థిక సాయం అందించారు. పుట్టుకతోనే మాటలు కోల్పోయిన మాలిక జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించింది. అయినప్పటికీ పంజాబ్ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటీవల ట్వీట్ చేసింది. ఇది కేటీఆర్ దృష్టికి వచ్చింది. వెంటనే ఇక్కడ నుంచి అధికారులని పంజాబ్ కు పంపించి ఆమెని ఇక్కడకు రప్పించారు.

ట్విట్టర్‌లో చురుగ్గా ఉండే కేటీఆర్ దృష్టికి మాలిక పోస్ట్ వచ్చింది. వెంటనే ఆయన దివ్యాంగ సంక్షేమ శాఖ కమిషనర్ శైలజ, ఇతర అధికారులను పంజాబ్ పంపించారు. వారితో కలిసి నిన్న జలంధర్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మాలికను కేటీఆర్ ప్రగతి భవన్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. అనంతరం వ్యక్తిగతంగా రూ. 15 లక్షల చెక్కు, ల్యాప్ ట్యాప్ అందించారు. అలాగే, కేంద్రం కూడా స్పందించి మాలికకు సాయం అందించాలని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కోరారు. కేటీఆర్ సహాయానికి ఆమె ముగ్దురాలైంది.తన స్వంత రాష్ట్రంలో కూడా తనకు ఆదరణ లేదని తాను తన ఆవేదన ట్విట్టర్ లో మంత్రమే తెలియజేశామని దీన్ని గమనించిన కేటీఆర్ తనను ఇక్కడకు పిలిపించి సహాయం అందించిన తీరు జీవితంలో మర్చిపోలేనిది ఆమె పేర్కొన్నారు.

Related posts

ఇండియా సహా 20 దేశాలపై సౌదీ నిషేధం

Drukpadam

అమరావతిలో లాండ్ పూలింగ్ మళ్లీ షురూ.. భూములిచ్చేందుకు రైతుల ఉత్సాహం!

Ram Narayana

పీవీ సింధుకు భారత్ లో బ్రహ్మరథం …

Drukpadam

Leave a Comment