Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

ఐపీఎల్ లో రాహుల్ కు 17 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో …

ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా అవతరించిన కేఎల్ రాహుల్

  • కేఎల్ రాహుల్ ను రూ. 17 కోట్లకు తీసుకున్న లక్నో జట్టు
  • గత సీజన్ లో రూ. 17 కోట్లు అందుకున్న కోహ్లీ
  • కోహ్లీ రికార్డును సమం చేసిన రాహుల్

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా అవతరించాడు. ఐపీఎల్ 2022కు మెగా వేలంపాటను నిర్వహించబోతున్నారు. మరోవైపు ఈ సీజన్ లో మరో రెండు కొత్త జట్లు అహ్మదాబాద్, లక్నో జట్లు తోడవనున్నాయి. దీంతో వేలంపాట మరింత ఆసక్తికరంగా మారనుంది.

మరోవైపు ఈ రెండు జట్లు తమ డ్రాఫ్ట్ పిక్స్ ను అధికారికంగా ప్రకటించాయి. బీసీసీఐ రిటెన్షన్ నిబంధనల ప్రకారం ఇరు జట్లు ముగ్గురేసి ఆటగాళ్లను తీసుకున్నాయి. లక్నో జట్టు కేఎల్ రాహుల్ ను రూ. 17 కోట్లకు తీసుకుంది. అంతే కాదు తమ జట్టుకు కెప్టెన్ గా ఎంచుకుంది. ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కోహ్లీ పేరిట ఇప్పటి వరకు రికార్డు ఉంది. గత సీజన్ లో కోహ్లీ రూ. 17 కోట్లు అందుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును రాహుల్ అందుకున్నాడు. మరోవైపు అహ్మదాబాద్ జట్టు హార్ధిక్ పాండ్యా, రషీద్ ఖాన్ లను రూ. 15 కోట్లకు తీసుకుంది.

 

ఐపీఎల్ లో ఈసారి నిజంగా మెగా వేలం… బరిలో 1200 మందికి పైగా ఆటగాళ్లు

  • ఫిబ్రవరిలో ఐపీఎల్ వేలం
  • 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం
  • వేలానికి 318 మంది విదేశీ క్రికెటర్లు
  • జనవరి 20తో ముగిసిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ
More players to IPL Mega Auction
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలో మరే లీగ్ అందించనంత ఎక్కువ మొత్తంలో ఆటగాళ్లకు ముట్టచెబుతుంది. అందుకే ఆటగాళ్లలో ఐపీఎల్ కు అంత డిమాండ్. ఈ ఏడాది వేలం కోసం భారీ సంఖ్యలో ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా మెగా వేలం నిర్వహించనున్నారు.

రిజిస్ట్రేషన్లకు తుది గడువు జనవరి 20వ తేదీ కాగా, మొత్తం 1,214 మంది ఆటగాళ్లు ఐపీఎల్ వేలం కోసం తమ పేర్లు నమోదు చేయించుకున్నారు.  ఇందులో 318 మంది విదేశీ ఆటగాళ్లు. వీరిలో అత్యధికంగా ఆస్ట్రేలియాకు చెందినవాళ్లే 59 మంది ఉన్నారు.

ఇక భారత దేశవాళీ క్రికెటర్లు కూడా ఈసారి ఎక్కువ మంది వేలానికి వస్తున్నారు. 903 మంది అన్ క్యాప్డ్ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈసారి ఐపీఎల్ బరిలో రెండు కొత్త జట్లు (అహ్మదాబాద్, లక్నో) కూడా ఉండడంతో వేలం రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. ఈ రెండు ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసినప్పటికీ, జట్టు నిర్మాణం కోసం వేలంలో భారీ మొత్తంలో వెచ్చించే అవకాశాలున్నాయి.

Related posts

టీవీ డిబేట్ లో పాక్ మాజీ క్రికెటర్ అక్తర్ కు అవమానం ….

Drukpadam

భారత్ క్రికెట్ లో ప్రయోగాలు … ఐర్లాండ్ టూర్ కెప్టెన్ గా హార్థిక్ పాండ్య!

Drukpadam

భారత్ కు ఒక బిట్ కాయిన్ ను విరాళంగా ప్రకటించిన ఆసీస్ మాజీ క్రికెటర్

Drukpadam

Leave a Comment