Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైసీపీలో సుబ్బారావు గుప్త తలనొప్పి …మరో రఘరామ అంటున్న కార్యకర్తలు

వైసీపీలో సుబ్బారావు గుప్త తలనొప్పి …మరో రఘరామ అంటున్న కార్యకర్తలు
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు ఇలాగే కొనసాగితే కార్యకర్తలు తిరగబడతారని వ్యాఖ్య
కొడాలి నాని వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉంది
నానిపై జగన్ చర్యలు తీసుకోకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా
క్యాసినో నిర్వహించకుంటే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారు?

సుబ్బారావు గుప్త వైసీపీకి చెందిన చోట నాయకుడను …ఒంగోలు కు చెందిన సుబ్బారావు గుప్త మంత్రి బాలినేనికు దగ్గరవాడనే పేరుంది. వివాద స్పద వ్యాఖ్యలు చేయడం తరువాత నాలుకకరుచుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. అంతకుముందు వల్లభనేని వంశీపై మాటలతో దాడిచేసి వివాదంలో చిక్కుకున్న సుబ్బారావు గుప్త తాజాగా కొడాలినాని వ్యవహార శైలిపై స్పందించారు. ఆయన వాడుతున్న భాష వల్ల పార్టీకి నష్టమన్నారు .ఇంతవరకు బాగానే ఉన్న ఆయన్ను పార్టీ నుంచి భావిష్కరించకపోతే తానే పార్టీని భావిష్కరిస్తానని అల్టిమేటం జారీచేశారు. ఇది ఇప్పుడు వైసీపీ లో హాట్ టాపిక్ గా మారింది. సొంతపార్టీకి చెందిన సుబ్బారావు గుప్త వైసిపిని భావిష్కరిస్తానని ప్రకటించడమా ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. ..ఈయన మరో రఘురామల తలనొప్పిగా తయారు అయ్యాడనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

మంత్రి కొడాలి నాని వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోందని, అది అలాగే కొనసాగితే కార్యకర్తలే తిరగబడతారని వైసీపీ నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా అన్నారు. ఒంగోలు ప్రెస్ క్లబ్‌లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి నాని వాడుతున్న భాష సరిగా లేదన్నారు. మంత్రి వాడుతున్న భాషకు కొందరు సంతోషిస్తున్నప్పటికీ ఎక్కువమంది మాత్రం చీదరించుకుంటున్నారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీకి తీరని నష్టం జరుగుతుందన్నారు.

మంత్రి నానిపై ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో తాను గుడివాడ నుంచి బరిలోకి దిగుతానని తెలిపారు. ఒంగోలులో తన ఇంటిపై దాడిచేసిన వ్యక్తులపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కుమారుడు ప్రణీత్‌రెడ్డి ఒంగోలులో మాఫియా నడుపుతుంటే బాలినేని మాత్రం ఏమీ తెలియనట్టు నటిస్తున్నారని అన్నారు. గుడివాడలో క్యాసినో నిర్వహించారన్న టీడీపీ ఆరోపణల్లో నిజం లేకుంటే ఆ పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు.

Related posts

తెలంగాణ పై విషం చిమ్మిన మోడీ …మంత్రి నిరంజన్ రెడ్డి ఘాటు స్పందన !

Drukpadam

టీఆర్ఎస్ ఎంపీలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం!

Drukpadam

హుజూరాబాద్ దళితనేతకు స్వయంగా ఫోన్ చేసిన సీఎం కేసీఆర్!

Drukpadam

Leave a Comment