ఖమ్మంలో వారిద్దరూ ఒక్కటయ్యారు…
–గాయత్రీ రవి ,పువ్వాడ అజయ్ అపూర్వ కలయిక
–గాయత్రీ రవి వేడుకలు వారిని కలిపాయి
–బేధాలు మరిచారు …కలిసి నడవాలనుకున్నారు
ఖమ్మం జిల్లాలో నిన్నటివరకు ఉప్పు నిప్పుగా ఉన్న వారిద్దరూ ఒక్కటైయ్యారు . ఈ అపూర్వ కలయికను చేసేందుకు అభిమానులు భారీగానే తరలివచ్చారు . అదేనండి మన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,గాయత్రీ గ్రానైట్ అధినేత వద్దిరాజు రవిచంద్ర కలయిక… అనేకమందికి ఆశ్చర్యాన్ని కలిగించింది…. కొందరికి కోపం తెప్పించింది…. మరికొందరు రాజకీయం అంటున్నారు …. ఏదిఏమైనా వారిని రవిజన్మదిన వేడుకలు కలిపాయి.
రవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రవి ఆహ్వానం మేరకు మంత్రి అజయ్ రవి ఇంటికి వచ్చారు . కేక్ కట్ చేశారు రవికి తినిపించారు. ఈ సందర్భంగా అభిమానులు గజమాలతో మంత్రిని,వద్దిరాజు రవిని కలిపి సత్కరించారు. ఈ దృశ్యం చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు . ఇందుకు కారణం లేకపోలేదు చాలారోజులుగా వారిమధ్య సఖ్యత లేదు… దీంతో ఒకరంటే ఒకరి శత్రువైఖరి కాకపోయినా మిత్రత్వం లేదు … అంతకుముందు వేరు వేరు పార్టీలలో ఉన్నప్పుడు కలిసి నడవాల్సిన అవసరంలేదు గనక ఏ ఇబ్బందులు లేవు .కానీ ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు .దీంతో వారి మధ్య సఖ్యత లేకపోవడం ఇద్దరినీ అభిమానించే వారికీ ఇబ్బందిగా మారింది. రవి జన్మదిన వేడుకలను మంత్రి సమక్షంలో నిర్వహించుకొని తామిద్దరం ఒకటేనని చెప్పే ప్రయత్నం చేశారు . ఇది ఇద్దరికీ రాజకీయంగా ఉపయోగమేననే అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. ఎంత వరకు ఎవరికి ఉపయోగపడతాయనేది ఇప్పుడే చెప్పటం టు అర్లీ అనే అభిప్రాయాలు లేకపోలేదు.
రవి స్వతహాగా వ్యాపారి ,రాజకీయాలపై మక్కువ ,గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖమ్మం అసెంబ్లీ సీటు కోసం చివరికంటా ప్రయత్నం చేశారు . చివరకు వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేశారు . కానీ ఖమ్మం జిల్లాలో రాజకీయాలు చేయాలనీ ఉత్సాహపడుతున్నారు . అందుకోసం ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు .
మంత్రి రాజకీయంగా తన నియోజకవర్గంలో భవిషత్ కోసం గట్టి పునాదులు వేసుకుంటున్నారు. అందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు . ఒకపక్క నియోజవర్గ అభివృధ్ధికోసం శ్రమిస్తూనే ,మరో పక్క తనంటే గిట్టనివారిని తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది శాస్వితంగా ఉంటుందా ? తాత్కాలికమేనా అనే అనుమానాలు ఉన్నాయి. శాస్వితంగా ఉండాలని కోరుకుంటున్నారు . అయితే రాజకీయాలు కదా ? ఏదైనా జరిగే అవకాశాలు లేకపోలేదని మరికొందరి అభిప్రాయం .
గాయత్రి రవి పుట్టిన రోజు పలువురి శుభాకాంక్షలు …..
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) పుట్టిన రోజు వేడుకలు ఖమ్మంలోని ఆయన నివాసంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు మంత్రి పువ్వాడ, గాయత్రి రవి లను భారీ గజ మాలతో సత్కరించారు. తలసేమియా రోగుల కోసం అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన యువకులను మంత్రి అజయ్ కుమార్ అభినందించారు. కార్యక్రమంలో మంత్రి తో పాటు నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇంచార్జీ ఆర్జేసి కృష్ణ, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు ఉన్నారు.
గాయత్రి రవి పుట్టిన రోజు సందర్భంగా పలువురు వ్యాపార, రాజకీయ, సామాజిక ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సృజనారాణి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ చైర్మన్ మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, బిల్డర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు కొప్పు నరేష్ కుమార్, షిర్డీ సాయి దేవాస్థాన చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు, మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఆకుల గాంధీ, శెట్టి రంగారావు, జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు, కోశాధికారి జాబిశెట్టి శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్, టీఎన్జీవో యూనియన్ జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హసన్, గ్రానైట్ అసోసియేషన్ నాయకులు పాటిబండ్ల యుగంధర్, పీసీసీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు లింగాల రవికుమార్ తదితరులు ఉన్నారు.