Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సామాన్యులకు గుదిబండగా మారుతున్న రిజిస్ట్రేషన్ చార్జీలు… రియల్టర్స్ ఆందోళన!

సామాన్యులకు గుదిబండగా మారుతున్న రిజిస్ట్రేషన్ చార్జీలు… రియల్టర్స్ ఆందోళన

ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలనే ప్రతిపాదన సామాన్యులకు గుదిబండగా మారిందని రియల్ ఎస్టేట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రంగారావు విమర్శించారు . ఆరునెల్ల క్రితమే పెంచిన ప్రభుత్వం ఆదాయంకోసమే భూములు కనుగోలు అమ్మకాలపై విధించడం దారుణమని అభిప్రాయపడ్డారు . సోమవారం ఖమ్మం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలనే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ సర్కార్ రాబడి సామాన్లకు గుదిబండగా మారిందని , ఫ్లాట్లు , భూములు కొనుగోలు దారులకు కత్తిమీద సాములా ఉందని , స్థిరాస్తి వ్యాపారులకు పెనుభారంగా మారిందని , ఆరు నెలల క్రితమే పెంచిన ప్రభుత్వం మరల వెంటనే పెంచడం భావ్యం కాదన్నారు . చార్జీలను పెంచడం వల్ల మధ్య తరగతి , సామాన్య ప్రజలు సొంతిల్లు కలలను , కల్లలు గానే నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు , చార్జీల పెంపుపై ప్రజలలో పూర్తి వ్యతిరేకత ఉందని , వారి రాబడి కోసం రియల్ ఎస్టేట్ రంగానికి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరైంది కాదని విమర్శించారు . ధరణి తీసుకొచ్చి చాలా నష్టపర్చారని , ధరణి వల్ల సామాన్య రైతులకు , ప్రజలకు ఏ విధమైన ఉపయోగం లేదని అన్నారు . దాని ప్రభావం రియల్ ఎస్టేట్పై తీవ్రంగా పడిందని పేర్కొన్నారు . అయినా సరే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ముందుకు నెట్టుకుంటూ పోతుంటే రియల్ ఎస్టేట్ రంగాని నడ్డివిరస్తున్నారని అన్నారు . ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయం తీసుకువచ్చే రంగం రియల్ ఎస్టేట్ అని , వ్యవసాయం తర్వాత అనేక మందికి జీవనోపాధి కల్పించేది కనుక దానిని మనం కాపాడుకోవాలని అన్నారు . దీని వల్ల అనేక మంది లబ్ధి పొందారని అన్నారు . రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకుని ఉన్న వాళ్లకు కరోనా మొదట వెవ్ లో , కరోనా రెండవ వేవ్ లో చాలా నష్టపోయామని పేర్కొన్నారు . పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని లేని పక్షంలో రియల్టర్ అంతా ఒక్కటై రాష్ట్రం మొత్తం మీద ఒక పెద్ద ఉద్యమానికి పూనుకుంటామని , గతంలో ఎల్ఆర్ఎస్ మీద ఏ విధంగా చేశారో అదే విధంగా చేస్తారని హెచ్చరించారు . రియల్టర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ అన్నం వీరప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగాన్ని అతలాకుతలం చేయటానికే పూనుకున్నట్టు కనిపిస్తుందని ఆరోపించారు , ఆరు నెలల క్రితం ముప్పై శాతం పెంచిందని మరలా ఈసారి యాభై శాతం పెంచుతామని ప్రకటించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు . సామాన్య ప్రజలు యాభై , వంద గజాలు కొనటానికి కూడా భయపడుతున్నారని అన్నారు . ప్రభుత్వం మరోసారి ఆలోచించి ఛార్జీలను పెంచడాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు . ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ సామినేని విజయ్ కుమార్ , రఘునాథపాలెం మండలం ప్రెసిడెంట్ అబ్బగాని వెంకన్న , చింతకాని మండలం ప్రెసిడెంట్ కొడవకంటి మురళి బాబు , జిల్లా కమిటీ మెంబర్ బుర్రీ శ్రీనివాసరావు , బుర్రా సురేష్ బాబు , ఖమ్మం టౌన్ ట్రెజరర్ తదితరులు పాల్గొన్నారు .

Related posts

ఏడు ఖండాలు కాదు.. అన్నీ కలిసి ఒక్క ‘అమేషియా’ అవుతుంది…

Drukpadam

ఎవరు ఏ బట్టలు వేసుకోవాలి అనేదానిపై ప్రభుత్వాలకు ఏంపని …హిజాబ్ పై కేసీఆర్!

Drukpadam

శర్వానంద్ మాకు మరో రామ్ చరణ్ లాంటివాడు: చిరంజీవి

Drukpadam

Leave a Comment