పోడుభూముల సాగుదార్లకు ప్రభుత్వం రక్షణ : మంత్రి పువ్వాడ అజయ్!
-సీఎం కేసీఆర్ మంచి ఉద్దేశ్యం తో పోడుసాగుదార్లకు పరిస్కారం చూపించబోతున్నారు
-ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
-నిర్ణిత కాలవ్యవధిలో పొదుభులకు పరిస్కారం లభిస్తుంది.
అటవీ సంరక్షణ, పునర్జీవనానికి శాశ్వత పరిష్కారం కల్పించేందుకు, చాలా కాలంగా పోడు భూములను సాగుచేస్తూ, అటవీ హక్కు పత్రాలు పొందని గిరిజన, గిరిజనేతరులకు న్యాయం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో పోడు భూములపై సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అటవీ భూముల పరిరక్షణకు, ఆక్రమణలు కాకుండా నియంత్రణకై, పోడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, జిల్లా మంత్రి అధ్యక్షతన, జిల్లా కలెక్టర్ కన్వీనర్, పోలీస్ కమీషనర్, ఐటిడిఎ పీవో, అదనపు కలెక్టర్లు, జిల్లా అటవీశాఖ అధికారి, డిఆర్డీవో, డిడబ్ల్యుఓ సభ్యులుగా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్ ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు
…
సమావేశంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, పోడు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీచేసిందని అన్నారు. అటవీ, రెవిన్యూ శాఖలు సమస్యలు చర్చించుకుని పరిష్కరించాలన్నారు. జిల్లాకు మంచి పేరు ఉందని, ఈ విషయములో కూడా మంచి పేరు కాపాడుకోవాలని అన్నారు.
సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఒక మంచి విజన్తో పోడు భూముల సమస్య ముగింపుకు చర్యలు చేపట్టారని అన్నారు. అందుకు అనుగుణంగా అడవుల పరిరక్షణ, వాతావరణ సమతుల్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అమలుచేయాలన్నారు. అధికారులకు క్షేత్ర పరిధిలో చేపట్టాల్సిన చర్యలపై పూర్తి స్పష్టత ఉండాలని, సాంకేతిక సమస్యలు ఉండకూడదని అన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిఒక్కరూ బాధ్యతగా మెలగాలని ఆయన తెలిపారు. చట్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. అందరం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రక్రియ ఆలస్యమయిన కొద్దీ సమస్యలు అధికామవుతాయని, త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. దరఖాస్తుల రాజకీయ ప్రమేయం లేకుండా పరిష్కరించాలన్నారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, అటవీ భూములకు హద్దులు పెట్టాలని అన్నారు. పూర్వం భూములకు పట్టాలు వుండి, ఎల్.ఆర్.యూ.పి అప్పుడు అటవీ శాఖ అభ్యంతరాలు వచ్చాయని వీటిని పరిష్కరించాలని అన్నారు. పోడు భూముల ప్రక్రియకు కాలపరిమితి పెట్టి, ఆ సమయంలోగా పరిష్కరించాలని అన్నారు.
సమావేశంలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మాట్లాడుతూ, పోడు భూముల సమస్య తన నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నట్లు, త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే సీజన్ కల్లా సమస్య పరిష్కారం అయ్యేలా వేగంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, 2008 నుండి 2022 కాలంలో ఆర్వోఎఫ్తార్ క్రింద 13276 దరఖాస్తులు స్వీకరించి, రెవిన్యూ, అటవీ శాఖల సంయుక్త సర్వేతో 6143 దరఖాస్తులను ఆమోదించి, 17,861 ఎకరాలకు పట్టాలు అందజేసినట్లు తెలిపారు. వీరికి రైతుబంధు ఇస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ దఫాలో 18,295 దరకాస్తులు అందినట్లు వీటిపై ఇప్పుడు చర్యలు తీసుకోకున్నట్లు తెలిపారు. సమావేశం తదుపరి, క్షేత్ర సామాగ్రిని సిద్ధం చేసుకొని, మార్గదర్శకాల మేరకు ప్రక్రియను చేపడతామని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, భద్రాచలం ఐటిడిఎ పీవో గౌతమ్ పోట్రూ, అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అదనపు డిసిపి బోస్, డిఆర్డీవో విద్యాచందన, డిటిడబ్ల్యూఓ కృష్ణా నాయక్, తదితరులు పాల్గొన్నారు.