Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

‘గో బ్యాక్’ అంటూ అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా పోస్టర్లు!

‘గో బ్యాక్’ అంటూ అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా పోస్టర్లు!

  • తాడేపల్లిగూడెంలో కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర
  • ఫేక్ యాత్రికులు అంటూ రైతులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
  • అమరావతి రియలెస్టేట్ వద్దు.. ఆంధ్రా స్టేట్ ముద్దు

ఏపీలో మూడు రాజధానులు …లేదు అమరావతి రాజధానిగా ఉండాలని రెండు రకాల వర్షన్లతో అక్కడ ఒకరకమైన యుద్ధం జరుగుతుంది…మూడు పంటలు పండే అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాలకు చెందిన రైతులవద్ద భూములు సేకరించిన ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తామని , భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన భూముల్లో ప్లాట్లు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నది చంద్రబాబు ప్రభుత్వం ..తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతి శాసనరాజధానిగా విశాఖ ఎక్సక్యూటివ్ రాజధానిగా , న్యాయరాజధానిగా కర్నూల్ ను చేస్తామని అసెంబ్లీ లో తీర్మానం చేసింది. దీనిపై 29 గ్రామాలకు చెందిన రైతులు కమిటీగా ఏర్పడి హైకోర్టు కు వెళ్లారు .దీంతో కోర్ట్ జోక్యం చేసుకొని అమరావతిని అభివృద్ధి చేయాలనీ తీర్పు నిచ్చింది.29 గ్రామాల రైతుల ప్రయోజనాలు , అన్ని ప్రాంతాల అభివృద్ధి అనేది చర్చకు దారితీసింది. దీనిపై మిగతా ప్రాంతాలు మౌనంగా ఉన్నాయనే అభిప్రాయాలు ఇప్పటివరకు ఉన్నాయి. కానీ అరసవల్లి యాత్రకు రైతులు బయలు దేరడంతో తిరిగి రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.తాడేపల్లిలో మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో పోస్టర్లు వెలిశాయి. ఇది రాజధాని యాత్రకాదు కేవలం టీడీపీ రాజకీయ యాత్ర అంటూ విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.

అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం తాడేపల్లిగూడెంకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఫ్లెక్సీల వార్ నెలకొంది. కొందరు అమరావతి రైతులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా… మరికొందరు రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

రైతులకు వ్యతిరేక ఫ్లెక్సీల్లో ‘గో బ్యాక్ ఫేక్ యాత్రికులు’ అని పేర్కొన్నారు. రైతుల ముసుగులోని ఫేక్ యాత్రికులు గో బ్యాక్ అని ఫ్లెక్సీల్లో రాశారు. ‘అమరావతి రియలెస్టేట్ వద్దు. ఆంధ్రా స్టేట్ ముద్దు’ అని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం జగన్ ఆరాటం… 26 గ్రామాల కోసం చంద్రబాబు నకిలీ పోరాటం అని రాశారు. జగన్ ది అభివృద్ధి మంత్రం.. చంద్రబాబుది రాజకీయ కుతంత్రం అని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఫ్లెక్సీలపై అమరావతి రైతులు, టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు.

Related posts

విశాఖకు ప్రధాని మోడీ… గ్రాండ్ వెల్ కం ….

Drukpadam

రేపే ఢిల్లీలో దీదీ నేతృత్వంలో కీలక సమావేశం… సీపీఎం దూరం..

Drukpadam

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ విధానాల కార‌ణంగా 24 గంట‌లు విద్యుత్‌:ఎంపీ నామ

Drukpadam

Leave a Comment