Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మునుగోడులో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ …యంత్రాంగం అంతా అక్కడే !

మునుగోడులో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ …యంత్రాంగం అంతా అక్కడే !
-మునుగోడును 80 యూనిట్లుగా విభజించిన కేసీఆర్ …86 మంది ఎమ్మెల్యేలకు భాద్యతలు
-ఒక్కో యూనిట్ కు ఒక్కో ఎమ్మెల్యే ఇంఛార్జ్…20 సహాయకులు
-మునుగోడు ఉప ఎన్నికకు కేసీఆర్ భారీ స్కేచ్
-జాతీయ పార్టీని ప్రారంభించబోతున్న కేసీఆర్: దేశమంతా ఆకర్షించేలా భారీ మెజారిటీ కోసం దిశగా అడుగులు
-మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ అధినేత
-దసరా మరుసటి రోజు నుంచి నేతలంతా మునుగోడులోనే

దేశంలో అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఖాళీ అయిన స్థానాలకు నవంబర్ 3 న ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షడ్యూల్ విడుదల చేసింది.అందులో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరుగుతున్నా నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఈఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతీయపార్టీ పెడుతున్న కేసీఆర్ వైపు దేశం అంట చూస్తుంది. అందువల్ల ఇక్కడ గెలవడం ద్వారా బీజేపీ ,కాంగ్రెసులకు ఝలక్ ఇచ్చి టీఆర్ యస్ కు తెలంగాణాలో తిరుగులేదని నిరూపించుకోవాలని గట్టి సంకల్పంతో ఉన్న కేసీఆర్ అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేశారు .మొత్తం పార్టీ ఎమ్మెల్యేలను , యంత్రాంగాన్ని మునుగోడువైపు నడిపిస్తున్నారు . ఎన్నికలు అయ్యేంతవరకు అక్కడే ఉండే విధంగా ఆదేశాలు కూడా జారీచేశారు . 86 ఎమ్మెల్యేలు మంత్రులు ,ఎంపీలు ,ఎమ్మెల్సీలు జడ్పీ చైర్మన్లు ఇతర కార్పొరేషన్ల ప్రతినిధులు అందరు ప్రచారంలో పాల్గొనేలా రంగం సిద్ధం చేశారు .

మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. అన్ని ప్రధాన పార్టీలు విజయమే లక్ష్యంగా అస్త్రశస్త్రాలను తీస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ భారీ ప్లాన్ చేస్తోంది. దసరా మరుసటి రోజు నుంచి పార్టీ యంత్రాంగమంతా మునుగోడులోనే మోహరించేలా ముఖ్యమంత్రి ప్లాన్ చేశారు. మునుగోడు నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్ కు ఒక్కో ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా నియమించారు.

ఎన్నిక ప్రచారసరళిని పర్యవేక్షించే బాధ్యతను కేటీఆర్, హరీశ్ రావులకు అప్పగించారు. ఒక్కో యూనిట్ లో ఎమ్మెల్యే కింద 20 మంది నేతలు ప్రచార పర్వంలో పాల్గొంటారు. అక్టోబర్ 6 నుంచి నియోజకవర్గంలోని ప్రతి గడపను చుట్టేశాలా కేసీఆర్ ప్రణాళిక రచించారు. దసరా మరుసటి రోజు నుంచి ఎన్నిక జరిగేంత వరకు ఇన్ఛార్జీలంతా మునుగోడులోనే ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. జాతీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో… మునుగోడు ఉపఎన్నికను కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Related posts

ఢిల్లీలోనే సుప్రీంకోర్టు ఉండటం అన్యాయం: మద్రాస్ హైకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు!

Drukpadam

గజ్వేల్‌లో కేసీఆర్ పోటీ చేయాలి.. సిట్టింగులకు సీట్లివ్వాలి: రేవంత్ రెడ్డి సవాల్

Drukpadam

అమెరికాలో అరుదైన కేసు… గుండె కుడివైపున కలిగివున్న అమ్మాయి!

Drukpadam

Leave a Comment