Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చక్కని కంటి చూపునకు కొన్ని చిట్కాలు!

చక్కని కంటి చూపునకు కొన్ని చిట్కాలు!

  • కంటి చూపు వయసు పెరుగుతున్న కొద్దీ క్షీణిస్తుంది
  • పోషకాలు, వ్యాయామాల లేమి ప్రభావం
  • కుటుంబలో వ్యాధుల చరిత్ర ఉంటే ముందే జాగ్రత్తపడాలి

కంటి చూపు క్రమంగా తగ్గుతున్న వారు మొదట్లోనే కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా, చూపు మరింత దెబ్బతినకుండా జాగ్రత్త పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి మార్పులు, పోషకాహారాన్ని సూచిస్తున్నారు. సాధారణంగా 40 ఏళ్లు దాటిన తర్వాత కంటి చూపు క్రమంగా తగ్గడం సహజమే. చిన్న వయసులో తగ్గుతుందంటే అది పోషకాల లేమి, కంటిపై ఒత్తిడి కావొచ్చు.

విటమిన్స్, మినరల్స్
కంటి చూపునకు విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ ఈ, జింక్ మంచి ఫలితమిస్తాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. అంతేకాదు, 50 ఏళ్లు దాటిన వారిలో కనిపించే మాక్యులర్ డీజనరేషన్ ను నివారిస్తాయి.  క్యారట్లు, రెడ్ పెప్పర్, బ్రొక్కోలీ, పాలకూర, స్ట్రాబెర్రీస్, చిలగడదుంప (స్వీట్ పొటాటో), సిట్రస్ పండ్ల నుంచి ఈ పోషకాలన్నీ అందుతాయి. ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి చేపల్లో పుష్కలంగా లభిస్తాయి. అవిసె (ఫ్లాక్స్ సీడ్) గింజల్లోనూ స్వల్ప మోతాదారులో ఉంటాయి. కాకపోతే ఈ గింజలు అందరికీ అరగవు. జీర్ణాశయ సమస్యలు ఉన్న వారు ఫ్లాక్స్ సీడ్ తీసుకోకూడదు.

కెరటోనాయిడ్స్
కంటి చూపులో ముఖ్య పాత్ర పోషించేవి ల్యూటిన్, జియాక్సాంతిన్. వీటిని కెరటోనాయిడ్స్ అంటారు. బ్రొక్కోలీ తదితర ఆకుపచ్చని కూరలు, గుడ్డులో లభిస్తాయి. సప్లిమెంట్ల రూపంలోనూ ఇవి లభిస్తాయి. మాక్యులర్ డీ జనరేషన్ ను నివారిస్తాయి.

వ్యాయామం
శారీరక వ్యాయామంతో కంటికి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా శారీరక శ్రమతో  టైప్ 2 మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలు రావు. ఇవి కంటి చూపునకు పెద్ద హాని కారకాలు.

కంటికి రక్షణ
ఆటలు ఆడుతున్నా, కంప్యూటర్ ముందున్నా, డ్రైవింగ్ చేస్తున్నా.. కంటికి రక్షణ కవచాన్ని ధరించడం ఎంతైనా అవసరం. దీనివల్ల కంటికి హాని జరగకుండా ఉంటుంది. ఎండలో వెళ్లే సమయంలో సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి.

పొగతాగడం
పొగతాగడం వల్ల కూడా కంటి చూపు దెబ్బతినొచ్చు. కనుక ఈ అలవాటు ఉన్న వారు మానేస్తే, మంచి ఫలితం కనిపిస్తుంది.

వారసత్వం
కొన్ని రకాల కంటి సమస్యలు వారసత్వంగా వస్తుంటాయి. గ్లకోమా, రెటీనల్ డిజనరేషన్, మాక్యులర్ డీజనరేషన్, ఆప్టిక్ అట్రోఫీ అనే సమస్యలు వారసత్వంగా వస్తాయి. కుటుంబంలో ఈ వ్యాధుల చరిత్ర ఉంటే, తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.

చేతులు శుభ్రం
చేతులను తరచూ కళ్లపై పెట్టుకోవడం చేయకూడదు. అవసరం ఏర్పడితే చేతులను సోప్ తో శుభ్రం చేసుకున్నతర్వాతే కంటిని పట్టుకోవాలి.

కంటిని పట్టుకోవాలి.

Related posts

రాహుల్ గాంధీ అందుకే పెళ్లి చేసుకోలేదట .. బీజేపీ ఎంపీ కటీల్ వివాదాస్పద వ్యాఖ్యలు!

Drukpadam

తెలంగాణలో లేకపోతే నాపై రాజద్రోహం కేసు పెట్టేవారేమో: ప్రొఫెసర్ నాగేశ్వర్!

Drukpadam

పవన్ కల్యాణ్ అనే నేను అనగానే చప్పట్లు, కేకలతోో మార్మోగిన సభా ప్రాంగణం…

Ram Narayana

Leave a Comment