Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించండి: బీజేపీ

రాహుల్ గాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించండి: బీజేపీ

  • చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే భారత్ నిద్రపోతోందన్న రాహుల్
  • భారత సైనికులు చైనా సైనికులతో తన్నులు తింటున్నారని వ్యాఖ్య
  • మన సైనికులను రాహుల్ అగౌరవపరిచారంటూ బీజేపీ ఫైర్

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భారత సైనికులను చైనా సైనికులు కొడుతున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. మన సైన్యం శక్తిసామర్థ్యాలను కించపరిచేలా మాట్లాడిన రాహుల్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రిమోట్ కంట్రోల్ నేత కాకపోతే తక్షణమే రాహుల్ పై వేటు వేయాలని డిమాండ్ చేశారు. దేశంపై గౌరవం ఉంటే ఈ పని చేయాలని అన్నారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్ లో కొనసాగుతోంది. నిన్న జైపూర్ లో రాహుల్ మాట్లాడుతూ, ఒకవైపు చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే… కేంద్ర ప్రభుత్వం దీన్ని గ్రహించకుండా నిద్రపోతోందని విమర్శించారు. చైనా సైనికులతో భారత సైనికులు దెబ్బలు తింటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో గౌరవ్ భాటియా మాట్లాడుతూ… రాహుల్ కు వ్యతిరేకంగా మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకోకపోతే… రాహుల్ గాంధీనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా తాము భావిస్తామని, ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వ్యాఖ్యలుగా పరిగణిస్తామని చెప్పారు.

Related posts

ప్రశాంత్ కిశోర్ ఎత్తుగడలు తెలంగాణలో పనిచేయవు: ఈటల

Drukpadam

రెండు పార్టీలు నాకు రాజ్యసభ ఆఫర్లు ఇచ్చాయి… అయినా తిరస్కరించా: సోను సూద్!

Drukpadam

ఇటు ధర్నా …అటు తనిఖీలు చల్లారని మునుగోడు హీట్…

Drukpadam

Leave a Comment