Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

ప్రపంచ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం నమోదు చేసిన భారత్ !

ప్రపంచ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం నమోదు చేసిన భారత్ !
శ్రీలంక పై 317 పరుగుల భారీ తేడాతో భారత్ విక్టరీ
390 పరుగులు చేసిన భారత్ …
73 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక…
తిరువనంతపురంలో చివరి వన్డే
తొలుత 5 వికెట్లకు 390 రన్స్ చేసిన భారత్
కోహ్లీ 166 నాట్ అవుట్ గిల్ 116 ,లతో సెంచరీలు
లక్ష్యఛేదనలో చేతులెత్తేసిన శ్రీలంక
వన్డే చరిత్రలో అతిపెద్ద విజయం నమోదు చేసిన భారత్

మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా అత్యంత ఘనంగా ముగించింది. తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో భారత్ 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 391 పరుగుల లక్ష్యఛేదనలో శ్రీలంక అత్యంత పేలవంగా 73 పరుగులకు కుప్పకూలింది.

సిరాజ్ 4 వికెట్లతో శ్రీలంకను హడలెత్తించగా, షమీ 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడిన అషేన్ బండార బ్యాటింగ్ కు దిగలేదు. అతడిని అబ్సెంట్ హర్ట్ గా పరిగణించారు.

లంక జట్టు కేవలం 22 ఓవర్లు మాత్రమే ఆడింది. ఆ జట్టులో ఓపెనర్ నువనిదు ఫెర్నాండో 19, కసున్ రజిత 13 (నాటౌట్), కెప్టెన్ దసున్ షనక 11 పరుగులు చేశారు.

కాగా, వన్డే చరిత్రలో ఇదే అతి పెద్ద విజయం. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉంది. 2008లో ఐర్లాండ్ జట్టును న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడా రికార్డును టీమిండియా తిరగరాసింది.

నేటి మ్యాచ్ లో విజయంతో భారత్ వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. పంచ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం నమోదు చేసిన భారత్ !
కోహ్లీ ,శుభమాన్ గిల్ లు వీరవిహారం చేశారు . వారి బ్యాటింగ్ ముందు శ్రీలంక బౌలర్లు చేతులెత్తేశారు .ఈ మ్యాచ్ లో 3 సిక్సర్లు కొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ 123 సిక్సర్లతో ధోని సరసన నిలిచాడు .

Related posts

నిజం ఏంటో బయటకు రావాలి.. కెప్టెన్సీ మార్పుపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న టీమిండియా

Ram Narayana

టీ20 వరల్డ్ కప్: ఆఫ్ఘనిస్థాన్ ఓటమి… టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతు!

Drukpadam

Leave a Comment