Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఖమ్మంలో వందేభారత్ రైలుహాల్టింగ్ … స్వాగతం పలికిన ఎంపీలు ..ఎంపీలు

ఖమ్మంలో వందేభారత్ రైలుహాల్టింగ్ … స్వాగతం పలికిన ఎంపీలు ..ఎంపీలు -వద్దిరాజు రవిచంద్ర,నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మధు
-ఎంపీలను సత్కరించిన రైల్వే అధికారులు
-జిల్లా కలెక్టర్,సీపీ సైతం హాజరు
-ఖమ్మం హాల్టింగ్ పట్ల ఖమ్మం ప్రయాణికుల హర్షం
-గంటలోనే విజయవాడ కు ,వరంగల్ కు

 

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి ఖమ్మం స్టేషన్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ఘన స్వాగతం పలికారు.సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ ఆదివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు.ఈ రైలు మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మంకు చేరుకోగా ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మధులు డప్పు చప్పుళ్లు,ప్రయాణీకుల చప్పట్లు,కేరింతల మధ్య పచ్చజెండా ఊపి ఘన స్వాగతం పలికారు.రైలు ఎక్కి బోగీలు,అందులో ఉన్న వసతులను పరిశీలించారు, అధికారులు,ప్రయాణీకులతో కొద్దిసేపు ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్,నగర పోలీసు కమిషనర్ విష్ణు వారియర్ తదితర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైల్వే అధికారులు ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావు,మధులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.ఎంపీల వెంట బీఆర్ఎస్ నాయకులు నల్లమల వెంకటేశ్వర రావు,గుండ్లపల్లి శేషగిరిరావు, పెద్ద సంఖ్యలో యువకులు ఉన్నారు.

ఢిల్లీ వెళ్లే సూపర్ ఫాస్ట్ రైళ్లను ఖమ్మంలో నిలుపుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు .

Related posts

రాహుల్ గాంధీ, ఖర్గేకు రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు…

Ram Narayana

రాహుల్ గాంధీ బుజ్జగింపుతో పంతం వీడిన డీకే…!

Drukpadam

ఒకరినొకరు కాపాడే ప్రయత్నంలో నీటమునిగి ఐదుగురు టీనేజర్ల దుర్మరణం!

Drukpadam

Leave a Comment