Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సోమేశ్ కుమార్ తరహాలో తెలంగాణ డీజీపీని కూడా ఏపీకి పంపాలి: ఎమ్మెల్యే రఘునందన్ రావు!

సోమేశ్ కుమార్ తరహాలో తెలంగాణ డీజీపీని కూడా ఏపీకి పంపాలి: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

  • తెలంగాణ సీఎస్ గా పనిచేసిన సోమేశ్ కుమార్
  • ఇటీవల సొంత క్యాడర్ ఏపీకి బదిలీ
  • డీజీపీ కూడా ఏపీ క్యాడర్ కు చెందినవారేనన్న రఘునందన్

ఇటీవలి వరకు తెలంగాణ సీఎస్ గా పనిచేసిన సోమేశ్ కుమార్ ను కొన్నిరోజుల కిందట ఏపీ క్యాడర్ కు పంపించేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే తరహాలో కొందరు ఉన్నతాధికారులు సొంత క్యాడర్ లో కాకుండా, తెలంగాణలో కొనసాగుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు.

అలాంటి అధికారుల్లో తెలంగాణ డీజీపీ కూడా ఉన్నారని, సోమేశ్ కుమార్ తరహాలో ఆయనను కూడా వెంటనే ఏపీ క్యాడర్ కు బదిలీ చేయాలని కోరారు. తెలంగాణలో ఉన్న ఏపీ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై పీఎంవోకు ఫిర్యాదు చేసినట్టు ఆయన వెల్లడించారు.

ఉన్నత సర్వీసుల అధికారులు ఎక్కడ పోస్టింగులు లభిస్తే అక్కడికి వెళ్లి పనిచేయాల్సి ఉంటుందని, సుప్రీం కోర్టు కూడా ఇదే విషయం చెబుతోందని అన్నారు. కానీ, కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) నిర్ణయంతో 15 మందిని సొంత క్యాడర్ కు పంపకుండా అడ్డుకున్నారని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని రఘునందన్ రావు పేర్కొన్నారు.

సొంత క్యాడర్ లో కాకుండా, తెలంగాణలో కొనసాగుతున్న అధికారులను వారి సొంత క్యాడర్ కు పంపించాలని స్పష్టం చేశారు. హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Related posts

రాహుల్ ను పీఎం చేయడమే తన కోరిక అని వైఎస్సార్ చెప్పారు: భట్టి విక్రమార్క…

Drukpadam

మోడీ పాలన కొనసాగితే ప్రజలకు మరింత కష్టం ….సోనియాగాంధీ హెచ్చరిక!

Drukpadam

మోదీ రాజీనామా చేయాలంటూ మోతెక్కిపోతున్న ట్విట్టర్

Drukpadam

Leave a Comment