మందబలం ఉందని ప్రతిపక్షాల గొంతు నొక్కొద్దు …శాసనసభలో సీఎల్పీ నేత భట్టి …
కాళేశ్వరం ప్రాజక్టు సందర్శనకు విదేశీయలను అనుమతిస్తారు …కాంగ్రెస్ సభ్యులని అనుమతించారు పైగా అరెస్ట్ చేస్తారా ..?
పెండింగ్ ప్రాజెక్టు లను పూర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలం
సీతారామ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తీ చేస్తారో చెప్పాలి ..
విశ్వనగరం హైద్రాబాద్ లో శాంతి భద్రతలు ఆందోళనకరం ..
రాష్ట్రంలో క్యాన్సర్ రోగులు పెరుగుతున్నారు ప్రత్యేక హాస్పటల్ నిర్మించాలి
దవాఖానాల్లో ఖాళీలను భర్తీ చేయాలి
ప్రభుత్వంలో వంద మంది సభ్యులుండోచ్చు. ప్రతిపక్షంలో ఒక్కరే ఉండొచ్చు. కానీ ప్రతిపక్షం గొంతు వినిపించడం ప్రజాస్వామ్యంలో ప్రధానఘట్టం. ప్రధాన లక్షణం. ఈ ప్రధానలక్షణం లేకుండ బంద్ చేస్తే అది ప్రజాస్వామ్యం కాదని ప్రభుత్వం తెలుసుకోవాలని సీఎల్పీ నేత భట్టి శాసనసభ బడ్జెట్ పై జరిగిన చర్చలో పాల్గొని ప్రభుత్వానికి చురకలు అంటించారు . పలుసందర్భాల్లో మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు జోక్యం చేసుకొని భట్టికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన ప్రసంగాన్ని కొనసాగించారు .
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు విదేశీయులకు, డిస్కవరీ చానల్స్ కు అవకాశం ఇస్తారు. కానీ ఆప్రాజెక్టును చూడటానికి ప్రతిపక్షాలకు అశకాశం ఇవ్వరు ఎందుకు ఇందులో ఉన్న మర్మం ఏమిటని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు .
గోదావరి వరదలతో మునిగిపోయిన పంప్ హౌజ్ లను చూడటానికి కాళేశ్వరం వెళ్లితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆరెస్ట్ చేయించారు. ఇదేక్కడి న్యాయం? కనీసం స్థానిక శాసనసభ్యుడు శ్రీధర్ బాబు ని కూడ అనుమతించకపోవడం దారుణం .ప్రజల సంపదతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, అవకతవకలు బయటపడుతాయన్న భయంతోనే ప్రభుత్వం మమ్మల్నీ అడ్డుకున్నట్టు అర్దమవుతుంది ప్రభుత్వ చర్యలను తప్పు పట్టారు .
కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ ప్రాజెక్టుల వెనుక ఉన్న భూములు ముంపునకు గురువుతున్నాయి. పంటలు నీట మునిగి రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యకకు శాశ్వత పరిష్కారం చేయాలి .కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టకముందు కాంగ్రెస్ హాయంలో చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం జరిగింది
.తెలంగాణలో బిఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏండ్లు దాటుతున్న ఆప్రాజెక్టును పూర్తి చేయకుండ గాలికివదిలేశారు. ఈ ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? ఎప్పుడు సాగు నీటిని రైతులకు అందిస్తారో సమధానం చెప్పాలి. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించే విధంగా పోరాటం చేసి నిధులు తీసుకురండి. ప్రభుత్వం డిపిఆర్ ను కేంద్రానికి సబ్ మిట్ చేస్తే పనులు ఎందుకు ఆగిపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి
.
జూరాల, కోయిలసాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్ కాదా..?
కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల వల్లనే పాలమూరులో నీళ్లు ఫుల్, చేపలు ఫుల్, పంటలు ఫుల్ అయ్యాయి. మేం చేసిన అభివృద్ధిని మీరు కంటిన్యూ చేశారంతే. దానినే గొప్పలుగా చెప్పుకుంటే ఎట్లా?
దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు 8లక్షల ఎకరాలకు సాగు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఏమి సమాధానం చెపుతారని ప్రశ్నించారు .
రాజీవ్ సాగర్, ఇందిరసాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతరామ ప్రాజెక్టుగా మార్చి 8ఏండ్లు అవుతున్న ఎందుకు పూర్తి చేయలేదు?
సీతమ్మ ఆనకట్ట కడితే దుమ్ముగూడేం, చర్ల, భద్రచలం మునగకుండ తీసుకునే చర్యలు ఏంటీ అని నిలదీశారు భట్టి ..
సీతమ్మ ప్రాజెక్టు నిర్మాణానికి భూ సేకరణ చేస్తున్న ప్రభుత్వం ఎకరానికి రూ.8లక్షలు ఇస్తే ఎట్లా? ప్రస్తుతం ధర 30లక్షలు ఉంది, కనీసం 24లక్షలు ఇవ్వండని ప్రభుత్వాన్ని కోరారు .
ఎ.పి ప్రభుత్వం సంఘమేశ్వర వద్ద రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేస్తే తెలంగాణలోని కృష్ణా నది ప్రాజెక్టులు ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది. ప్రభుత్వం దీనిపై డృష్టి సారించాలని కోరారు .
. కాంగ్రెస్ హాయంలో ప్రారంభించిన మధ్య తరహా నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తే కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుందనే కోపంతో ఆ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండ పెండింగ్ లో పెట్టడం సరికాదని అన్నారు .ఖమ్మం జిల్లాలోని మున్నేరుపై మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం పండ్రేగుపల్లిలో నిర్మించిన ప్రాజెక్టు 70శాతం పూర్తి అయ్యింది. మిగత 30 శాతానికి నిధులు ఇవ్వకుండ బిఆర్ ఎస్ ప్రభుత్వం అడ్డుకోవడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .
ఐటీసీకి మెయింటేనెన్స్ కు నిధులు పెంచండి
నల్లగొండ లో ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రాజెక్టు నిదులు ఇచ్చి పనులు త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలి…మునుగోడు ఉప ఎన్నికల్లో చర్ల శివన్నగూడెం రిజర్వాయర్ పూర్తి చేస్తామని చెప్పారు. ఇంక పనులు ప్రారంభించలేదు…. ఎప్పటిలోగా పూర్తి చేసి సాగు నీరు ఇస్తారో సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు .
డిండి ప్రాజెక్టుకు ఏదులా నుంచి ఇస్తారని, వటెం రిజర్వాయర్ నుంచి ఇస్తారన్న ప్రకటనలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి నీళ్లు ఇస్తారో స్పష్టత ఇవ్వాలని కోరారు .
మల్లన్న సాగర్ , సింగూర్ నుంచి సంగారెడ్డికి ఎప్పటిలోగా నీళ్లు ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి .సాగునీటి ప్రాజెక్టుల కొరకు తీసుకువచ్చిన అప్పులు రాష్ట్రంలో ఏయే ప్రాజెక్టులకు కేటాయించారు చెప్పాలన్నారు …
సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ నుంచి ఎన్ని టీఎంసీ ల నీళ్లను ఎత్తిపోశారు? దానికి అయిన ఖర్చు? ఎంత కరెంట్ చార్జీలు ఎంత? విశ్వనగరంగా చెప్పుకుంటున్న రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ లో పట్టపగలు దారుణంగా హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్యలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. వీటి నియంత్రణకు కఠినంగా వ్యవహరించాల్సిఉందన్నారు .
1996 పోలీస్ బ్యాచ్ లో కొందరి పదోన్నతులు ఇచ్చి కొందరికి ఆపారు. ఎందుకు ఆపారు? 2022 పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డులో కొత్త నిబంధనలు తీసుకురావడం వల్ల చాలా మంది పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్తులు నష్టపోతున్నారని ఆందోలన చేసిన ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ను అక్రమంగా ఆరెస్ట్ చేసి నక్సలైట్ మాధిరిగా విచారణ చేశారు అధికారం ఉంది కాదా అని ప్రతిపక్షాలను అణిచివేసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం .
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపితే గౌరవించండి. కానీ సంఘ విద్రోహ శక్తలును చూసినట్టు చూడకండి …2022లో పోలీస్ రిక్రూట్ మెంట్స్ ఈవేంట్స్ లో 2 క్వాలీఫై అయిన వారికి కూడ మెయిన్స్ రాసే అవకాశం ఇవ్వండి. ఈవేంట్స్ ను డబుల్ చేసి డిస్ క్వాలీఫై చేస్తే ఎట్లా?
పోలీసులతో సమానంగా చాలా ఏండ్ల నుంచి పని చేస్తున్న హోం గార్డులను ప్రభుత్వం పర్మినెంట్ చేసి పే స్కేల్ అమలు చేయాలని కోరుతున్నాను …గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 ప్రకారం చాలా మందికి మేలు జరుగుతుంది….గాంధీ ఆసుపత్రిలో ఈ రోజు గడువు దాటిన మందులు పంపిణీ చేయడంతో రోగులు ఆందోలన చెందుతున్నారు
.
ఆరోగ్య మంత్రి నెలకు ఒక్కసారైన ప్రభుత్వ ఆసుపత్రులను రెగ్యూలర్ గా విజిట్ చేస్తే వైద్య సిబ్బంది నిబద్ధతతో పని చేసే అవకాశం ఉంటుంది….ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్తకు చేరుకుంది. రోగులకు చికిత్స ఇబ్బందిగా మారింది. కొత్త బిల్డింగ్ కట్టండి….చాలా ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది కొరత ఉన్నది వెంటనే భర్తీ చేయాలి.
మనం తినే ఆహార పదర్థాలు అంత కల్తీమయం అవుతున్నాయి. నూనే, కారం, పసుపు, పాలు కల్తీ కావడం వల్ల క్యాన్సర్ రోగులు పెరిగిపోతున్నారు. కాబట్టి క్యాన్సర్ రోగులకు మెరుగైన సేవలు అందించడానికి రాష్ట్రంలో ఒక కొత్త క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించండి.
మన ఊరు–మన ప్రణాళిక, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వకుండ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం వల్ల సర్పంచ్ లు తీవ్రంగా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ఎక్కి సర్పంచ్లు దర్నాలు చేస్తున్న బిల్లులు ఇవ్వకపోవడం బాధాకరం…..గ్రామ పంచాయతీకి ఇచ్చిన ట్రాక్టర్ ఇఎంఐ చెల్లించకపోవడంతో మధిర మండలం సైదిల్లీపురం సర్పంచ్ పర్సనల్ ఖాతాను ఎస్ బిఐ బ్యాంకు అధికారులు ఫ్రీజ్ చేశారు….ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ వేతనాలు పెంచాలి. పర్మినెంట్ చేయాలి….కేంద్రం ఏటా ఈజిఎస్ పథకానికి నిధులకు కోత పెడుతున్నందున ఢిల్లీకి ఆఖిలపక్షం తీసుకువెళ్లితే మీరు. మేము కలిసి పోరాడుతాం కదా? ఎందుకు తీసుకువెళ్లడం లేదు.
కాంగ్రెస్ ఎంపిలు పార్లమెంట్ లో ఈ నిధులు కోసం పోరాటం చేస్తున్నారు….మత్స్య కార్మికులకు వలలు, టూ వీలర్ బైక్ లను పెద్ద సంఖ్యలో పంపిణీ చేయాలి….గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇప్పించి సర్టిఫికెట్స్ అందించి ఐడీ కార్డులు ఇవ్వాలి
గవర్నర్ వద్ద ఎన్ని బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. కారణాలు ఎంటీ? ..ప్రయివేటు యూనివర్శిటీల బిల్లు ఆమోదం రాకుండానే ఆయా విద్య సంస్థలు అడ్మిషన్లు తీసుకున్నాయి . ఇందులో చదువుతున్న విద్యార్ధుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు . కాబట్టి గవర్నర్ వద్ద ఉన్న బిల్లలకు ఆమోదం జరిగే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని భట్టి డిమాండ్ చేశారు .