ముగిసిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు!
- నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ
- సభకు సమాధానం ఇచ్చిన సీఎం కేసీఆర్
- ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం
- అనంతరం సభ నిరవధి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. సమావేశాలను కేవలం 7 రోజులే నిర్వించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.ప్రజాసమస్యలను చర్చించే వేదికగా ఉండాల్సిన అసెంబ్లీ సమావేశాలను అధికార పార్టీ దుర్వినియోగం చేస్తుందని విమర్శలు ఉన్నాయి. అత్యంత విలువైన బడ్జెట్ సమావేశాలు కనీసం 28 జరగాలని సీఎల్పీ నేత భట్టి డిమాండ్ ను అధికార పక్షం పట్టించుకోలేదు . బీజేపీ ,ఎంఐఎం పార్టీలు కూడా సమావేశాలు కొద్దీ రోజులపాటు మమ అనిపించుకోవడం పై మండిపడ్డారు . ప్రజాసమస్యలపై చర్చించేందుకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమని ప్రతిపక్షాలు అభిప్రాయపడ్డాయి. చర్చల సందర్భంగా కూడా ప్రతిపక్షాలకు సరైన సమయం ఇవ్వడంలేదని ప్రతిపక్షాలు అభిప్రాయం పడుతున్నాయి.
నేడు ద్రవ్య వినియమ బిల్లుపై సభలో చర్చ చేపట్టారు. సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 7 రోజుల పాటు సాగాయి. మొత్తం 56 గంటల 25 నిమిషాల సేపు అసెంబ్లీ కార్యకలాపాలు కొనసాగాయి. టీఆర్ఎస్ పార్టీ ఇటీవలే బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందడం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవే.