Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మమ్ములను గౌరవించే పార్టీలతోనే మా పొత్తులు …కూనంనేని!

మమ్ములను గౌరవించే పార్టీలతోనే మా పొత్తులుకూనంనేని!
బీజేపీ వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకం
మునుగోడువరకే బీఆర్ యస్ కు మా మద్దతు
ఓట్లు ,సీట్లపై కేసీఆర్ తో ఎలాంటి చర్చలు జరగలేదు
బీఆర్ యస్ తో స్నేహపూర్వకంగానే ఉన్నాం ..
బీజేపీనే మా ప్రధాన శత్రువు

రాష్ట్రంలో మారుతున్న రాజకీయపరిస్థితులు , బీఆర్ యస్ వైఖరిపై నిన్నమొన్నటివరకు సానుకూల దృక్పధాన్ని కలిగిఉన్న వాపపక్షపార్టీలు తమ వైఖరిని మార్చుకున్నాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే అదేమీ లేదుబీఆర్ యస్ మా స్నేహపార్టీ అంటున్నారు ఎర్రపార్టీ నేతలుఎన్నికలు నెత్తిమీదకు వస్తున్న వేళ మీరు ,మేము కలిసి పోటీచేద్దామన్నా, బీఆర్ యస్ నేత కేసీఆర్ నుంచి ఉలుకు పలుకు లేకపోవడమే అనుమానాలకుకారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ యస్ పట్ల ప్రజల్లో మిశ్రమ స్పందన ఉందని గ్రహించిన లెఫ్ట్ పార్టీలు పునరాలోచలవు పడ్డాయనే అభిప్రాయాలు కలుగుతున్నాయి . అయితే వారు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదుకాకపోతే బీఆర్ యస్ లెఫ్ట్ పార్టీలకు కేటాయించే సీట్లపై క్లారిటీ ఉంటె అందుకు అనుగుణంగా తమ కార్యాచరణ ఉంటుందని కామ్రేడ్స్ అభిప్రాయపడుతున్నారు.

పొత్తులు ,ఎత్తులపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఘాటుగానే స్పందించారు . తమను గౌరవించే పార్టీలతోనే పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు . తమది ఒక సిద్ధాంత నిబద్ధతకలిగిన పార్టీ, మాదే కాదు సిపిఎం అంతే బీజేపీ మతోన్మాదాన్ని మొదటినుంచి వ్యతిరేకిస్తుంది లెఫ్ట్ పార్టీ లేమా ప్రధాన శత్రువు బీజేపీనే విషయాన్నీ కొన్ని పార్టీలు ఇప్పడు గుర్తించాయి ,అందుకు సంతోషం బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టడంలో , వారితో కలిసి పనిచేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదుఅయితే ఎన్నికల విషయంలో తమ పార్టీలకు చట్టసభల్లో తగిన సీట్లు కావాలని కోరుకుంటాం .అందుకు ముందుకొచ్చిన లౌకిక పార్టీలతో కల్సి పోటీచేస్తామని అన్నారు .

మునుగోడు ఎన్నికల సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ మా మద్దతు అడిగారు . అందుకు మేము సానుకూలంగా స్పందించాంమద్దతు ఇచ్చాంబీజేపీని ఓడించాంఆసందర్భంగా గులాబీ పార్టీ నేతలు సైతం కమ్యూనిస్టుల మద్దతు లేకపోతె తాము గెలిచేవాళ్ళము కాదని అంగీకరించారు . భవిష్యత్ లో కూడా కలిసి పోటీచేద్దామని అన్నారు . బీజేపీని ఓడించే లక్ష్యంతో తాముకూడా కేసీఆర్ చేస్తున్న కృషిని స్వాగతిస్తున్నాంఅందుకు వారితో కలిసి ఎన్నికల్లో పోటీచేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు .కానీ తమ గౌరవానికి తగ్గకుండా సీట్లు ఇచ్చి సహకరించాలని కోరుతున్నామని అన్నారు . అందుకు సిపిఐ ,సిపిఎం మధ్య కూడా ఒక అంగీకారానికి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు . సీట్ల , ఓట్ల , ఎన్నికల పొత్తుల విషయంలో ఇప్పటివరకు కేసీఆర్ తో ఎలాంటి చర్చలు జరగలేదని సాంబశివరావు స్పష్టం చేశారు

Related posts

తెలంగాణ లో కింగ్ మేకర్ పాత్ర పోషించేందుకు సొంత పార్టీ ఆలోచనలో పొంగులేటి ఉన్నట్లు ప్రచారం….

Drukpadam

స్పీడు పెంచిన కాసాని.. తెలంగాణ టీడీపీకి కొత్త కార్యవర్గం …

Drukpadam

ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై విశ్వసనీయత లేదు: జీవీఎల్

Drukpadam

Leave a Comment