Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

స్నేహితుడ్ని చంపిన యువకుడి క్రూరత్వం చూసి విస్తుపోయిన పోలీసులు!

స్నేహితుడ్ని చంపిన యువకుడి క్రూరత్వం చూసి విస్తుపోయిన పోలీసులు!

  • అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం
  • అమ్మాయి విషయంలో స్నేహితుడ్ని చంపేసిన యువకుడు
  • తల, మొండెం వేరుచేసిన వైనం
  • గుండె చీల్చి, మర్మాంగాలు కోసి, పేగులు బయటికి లాగి బీభత్సం
  • నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్ శివారు ప్రాంతం అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన దారుణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తన ప్రియురాలితో స్నేహితుడు చనువుగా ఉంటున్నాడని కసి పెంచుకున్న ఓ యువకుడు అత్యంత పైశాచికంగా హత్య చేశాడు. 

నవీన్, హరిహరకృష్ణ స్నేహితులు. కాగా, ఓ అమ్మాయిని హరిహరకృష్ణ ఇష్టపడుతుండగా, అదే అమ్మాయితో నవీన్ సన్నిహితంగా మెలగడాన్ని హరిహరకృష్ణ భరించలేకపోయాడు. వీరు ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. అమ్మాయి విషయంలో హరిహరకృష్ణ, నవీన్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. కాగా, ఫిబ్రవరి 17న ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. నవీన్ కిందపడిపోగా, హరిహరకృష్ణ అతడి గొంతు పిసికి చంపేశాడు. ఆ తర్వాత ఉన్మాదిలా వ్యవహరించాడు. 

నవీన్ ఒంటిపై దుస్తులను తొలగించి, మొండెం నుంచి తలను వేరు చేశాడు. గుండె చీల్చేసి, మర్మాంగాలను కోసేశాడు. పొట్ట చీల్చి పేగులు బయటికి లాగేశాడు. కాగా, కత్తిని పట్టుకునే ముందే హరిహరకృష్ణ చేతులకు గ్లౌజులు ధరించాడు. వేలిముద్రలు దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు. నవీన్ సెల్ ఫోన్ ను కూడా ధ్వంసం చేశాడు. నవీన్ ను చంపేందుకు గత మూడు నెలల కిందటే హరిహరకృష్ణ డిమార్ట్ లో కత్తి కొనుగోలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. 

ఇక, హత్య చేసిన తర్వాత హరిహరకృష్ణ… మృతుడు నవీన్ తండ్రి శంకర్ కు ఫోన్ చేసి నవీన్ కనిపించడంలేదని తెలిపాడు. ఆ తర్వాత హరిహరకృష్ణ తన సెల్ ఫోన్ స్విచాఫ్ చేశాడు. దాంతో నవీన్ తండ్రి శంకర్ కు అతడిపై అనుమానం కలిగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హరిహరకృష్ణను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, నవీన్ ను తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. కాగా, నిందితుడు హత్య చేసిన విధానం అత్యంత క్రూరంగా ఉండడంతో, గతంలో అతడికి ఏమైనా నేర చరిత్ర ఉందా అని పరిశీలిస్తున్నారు. క్రైమ్ వెబ్ సిరీస్ లు, యూట్యూబ్ వీడియోలు చూసి హత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.

Related posts

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో సీబీఐ క‌స్ట‌డీకి అభిషేక్ రావు!

Drukpadam

తెలంగాణలో ఎన్నికల కోడ్… ఓ కారులో రూ.5 లక్షల నగదు స్వాధీనం

Ram Narayana

భారత్ లో లంచాలు ఇచ్చేందుకు నిధులు కేటాయించిన ఒరాకిల్…

Drukpadam

Leave a Comment