Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

యజమానిని కాపాడిన పెంపుడు కుక్క ….

సోఫాలో కూర్చోబోయిన ప్రతిసారీ మొరిగిన పెంపుడు కుక్క! యజమానికి అనుమానం వచ్చి చూస్తే..!

  • యజమాని ప్రాణాలు కాపాడిన పెంపుడు కుక్క
  • సోఫాలో కూర్చోబోయిన ప్రతిసారి యజమానిని అడ్డుకున్న కుక్క
  • అనుమానం వచ్చి సోఫాను చెక్ చేస్తే కనిపించిన విష సర్పం

యజమానులను కాపాడే క్రమంలో పెంపుడు కుక్కలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయవు. ఇందుకు సంబంధించి గతంలో ఎన్నో ఉదాహరణలు వెలుగుచూడగా ప్రస్తుతం మరో ఉదంతం వైరల్ అవుతోంది. ఓ వ్యక్తిని అతడి పెంపుడు కుక్క పాముకాటు నుంచి కాపాడింది. దక్షిణాఫ్రికాలోని క్వీన్స్‌బరోలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను నిక్ ఇవాన్స్ అనే పాముల సంరక్షకుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

నిక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్కాంబే అనే వ్యక్తి.. కొన్ని రోజులుగా తన పెంపుడు కుక్క ప్రవర్తనలో మార్పును గమనిస్తున్నాడు. అతడు తన ఇంట్లోని ఓ సోఫాలో కూర్చోబోయిన ప్రతిసారీ కుక్క పెద్ద పెట్టున మొరగడం మొదలెట్టేది. రోజుల తరబడి ఈ వ్యవహారం సాగింది. కుక్క తన యజమానిని సోఫాలో అస్సలు కూర్చోనిచ్చేది కాదు. కుక్క వింత ప్రవర్తనతో ఎస్కాంబేలో అనుమానం మొదలైంది.

దాంతో అతడు సోఫాను జాగ్రత్తగా పరిశీలించగా దాని కింద ఓ భయానక విష సర్పం కనిపించడంతో అతడు ఒక్కసారిగా షాకైపోయాడు. అతడి కంట పడింది బ్లాక్ మంబా అనే పాము. అది కాటేస్తే కేవలం 20 నిమిషాల్లో మరణం సంభవిస్తుంది. ఈ క్రమంలో ఎస్కాంబే పాములు పట్టే వ్యక్తి సాయంతో దాని పీడ వదిలించుకున్నాడు. పెంపుడు కుక్క తనను అప్రమత్తం చేయడంతోనే తన ప్రాణాలు నిలిచాయంటూ అతడు ఊపిరి పీల్చుకున్నాడు.

Related posts

విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన 1400 ఎకరాల భూముల విక్రయ ప్రక్రియ ప్రారంభం

Ram Narayana

Bose’s Most Iconic Headphones Are On Flash Sale

Drukpadam

మనవరాలికి జన్మనిచ్చిన నాయనమ్మ… సరోగసీలో కొత్త కోణం!

Drukpadam

Leave a Comment