Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మార్గదర్శిలో అక్రమాలపై ఆరోపణలు …రామోజీ రావుపై కేసు నమోదు…

మార్గదర్శిలో పెద్ద ఎత్తున అక్రమాల …రామోజీ రావుపై కేసు నమోదు…
-A 1 గా రామోజీ రావు , A 2 గా శైలజ ,A 3 గా మిగతా బ్రాంచి మేనేజర్లు
-ఐపీసీ సెక్షన్లు 120 B ,409 ,420 ,477 (a ) రెడ్ విత్ 34 లకింద కేసు నమోదు
-ఏపీ వ్యాప్తంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అధికారుల ఇళ్లలో సీఐడీ తనిఖీలు
-నిధులను మళ్లించారనే అభియోగాలతో సోదాలు
-విజయవాడ మేనేజర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న అధికారులు

ఆంధ్రప్రదేశ్ లో మార్గదర్శి చిట్ ఫండ్ లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని , నిధులు దారిమళ్లించారని , చిట్ నిధులను , మ్యూచ్ వల్ ఫండ్ లలో స్పాకులేటివ్ లో పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో మార్గదర్శి చైర్మన్ చెరుకూరి రామోజీ రావు , ఆయన కోడలు , చెరుకూరి శైలజ , మరియి బ్రాంచ్ మేనేజర్లపై కేసులు నమోదు అయ్యాయి. A 1 గా రామోజీ రావు , A 2 గా శైలజ ,A 3 గా మిగతా బ్రాంచి మేనేజర్లు ని కేసులో పెట్టారు .

గతంలో కూడా సోదాలు నిర్వహించిన సీఐడీ, రిజిస్ట్రేషన్ శాఖ
మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్లు, కీలక అధికారుల నివాసాల్లో ఏపీ సీఐడీ సోదాలను నిర్వహించింది . రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు జరిపారు అనేక అక్రమాలు వెలుగుచూసినట్లు తెలుస్తుంది . ఈ ఉదయం నుంచి సీఐడీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. విజయవాడ మార్గదర్శి మెయిన్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కంపెనీ నిధులను మళ్లించారనే అభియోగాలతో సోదాలు జరుగుతున్నాయి. గతంలో కూడా సీఐడీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తనిఖీలను నిర్వహించారు. నిధుల మళ్లింపుపై సీఐడీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫిర్యాదు చేయడంతో తాజాగా సోదాలను చేపట్టారు. అయితే దీనిపై మార్గదర్శి ఎలాంటి ప్రకటన చేయలేదు …

Related posts

కోర్టు ఉత్తర్వులను గౌరవించని అధికారులకు జరిమానా కాదు.. జైలు శిక్షే కరెక్ట్: మద్రాస్ హైకోర్టు

Drukpadam

ప్రపంచ మేటి సైన్యాల్లో భారత్​ కు నాలుగో స్థానం

Drukpadam

ఖమ్మం రూరల్ సి ఐ ని తక్షణమే బదిలీ చేయాలనీ ఈనెల 10 పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన …సిపిఐ!

Drukpadam

Leave a Comment