Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ నాయకత్వంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

కేసీఆర్ నాయకత్వంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కేసీఆర్ ముందుకు రావడాన్ని -స్వాగతిస్తున్నానన్న అశోక్ చవాన్
-కేసీఆర్ వ్యూహాలు అర్థం కావడం లేదని వ్యాఖ్య
-విపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్న చవాన్

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్… మహారాష్ట్రపై పూర్తి స్థాయిలో దృష్టిసారించారు. ఆయన మహారాష్ట్రలో రెండు భారీ బహిరంగసభలను నిర్వహించారు. ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ లో చాలా మంది చేరారు. ప్రస్తుతం మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కేసీఆర్ కొత్త రాజకీయ ప్రస్థానం, ఆయన నాయకత్వంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ స్పందించారు.

దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు కేసీఆర్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నానని చవాన్ చెప్పారు. కేసీఆర్ వ్యూహాలు అర్థం కావడం లేదని అన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని కేసీఆర్ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై చవాన్ స్పందిస్తూ… రాహుల్ పై వేటు వేయడాన్ని కేసీఆర్ ఖండించారని… దీన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. బీజేపీని కట్టడి చేయడానికి విపక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన చవాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Related posts

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో వామపక్షాల పయనమెటు ?

Drukpadam

నాడు చంద్రబాబు చేసిందే.. నేడు కేసీఆర్ చేస్తున్నారు: కిషన్ రెడ్డి…

Drukpadam

ధాన్యం సేకరణపై కేంద్రాన్ని నిలదీస్తూ పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించిన టీఆర్ఎస్ ఎంపీలు !

Drukpadam

Leave a Comment