సరిహద్దుల్లో డ్రోన్,వైమానిక దాడులకు వ్యతిరేకంగా గిరిజనుల ర్యాలీ…!
-సుకుమా-బీజాపూర్ పాలకుల చర్యలను తప్పు పడుతున్న గిరిజనులు
-గిరిజనుల ఆందోళనల వెనక మావోల హస్తం ఉంటుందని పోలీసుల ఆరోపణ
-చట్టబద్ధంగా ఆటవి ఉత్పత్తులను సేకరించే హక్కు కలిగి ఉన్న పాలకులు -హరిస్తన్నారని మండిపడుతున్న గిరిజనలు …
డ్రోన్ దాడులపై గిరిజనలు మండి పడుతున్నారు . మావోల కదలికలపై డ్రోన్లను ప్రయోగిస్తున్న పోలీసులకు వ్యతిరేకంగా గిరిజన గ్రామాల ప్రజలు ఐక్యం అవుతున్నారు . కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను నిరసిస్తున్నారు .
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలా నికి సరిహద్దున గల ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుకుమా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం డ్రోన్ దాడులను, వైమానిక దాడులను నిరసిస్తూ వందలాదిమంది గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేకసార్లు సుకుమా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో వైమానిక , డ్రోన్ దాడులు నిర్వహించిందని మావోయిస్టులు ఆరోపించారు. ఇది ఇలా ఉండగా బీజాపూర్ జిల్లాలోనీ కిస్టరం , గట్టపాడు గ్రామాల్లో మంగళవారం వందలాదిమంది గిరిజనులు ర్యాలీ చేపట్టారు. చేతుల్లో బ్యానర్లు, పోస్టర్లు పట్టుకొని తమ ప్రాంతాల్లో వైమానిక దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ గిరిజన ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తులు సేకరించడం కోసం అడవుల్లోనే ఉంటూ చెట్ల కింద బస చేస్తామని, తాము 24 గంటలు అడవిలోనే కాలం గడుపుతామని గిరిజనులు పేర్కొన్నారు. నిత్యం ఏరియల్ బాంబుల పెలుళ్లు కారణంగా తమ గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంటుందని వాపోయారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు .. సుకుమా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఇప్పటివరకు నాలుగు సార్లు ఏరియల్ బాంబు దాడి జరిగిందని అంటున్నారు . అడవిలోకి వెళ్ళటానికి భయపడుతున్నామన్నారు. ప్రస్తుతం విప్ప పువ్వు సేకరణ జరుగుతుందని పువ్వు సేకరణ కోసం తెల్లవారుజామున ,చీకటి ఉండగానే అడవికి వెళతామని ఆ సందర్భంగా గ్రామస్తులు అందరం గుమి కూడే అవకాశం ఉందని తెలిపారు. ఆకాశం నుండి బాంబులు పేల్చడం వల్ల తమ జాతికి నష్టం కలుగుతుందని వాపోయారు. తమ ప్రాంతాల్లో వైమానిక దాడులు, డ్రోన్ దాడులు, జరపరాదని, పోలీస్ క్యాంపులు కూడా ఎత్తివేయాలని కోరుతూ ప్లకార్డులు చేత బట్టి నిరసన తెలిపారు.