Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

పూంచ్ దాడి మా పనే: ప్రకటించిన జైషే మహ్మద్!

పూంచ్ దాడి మా పనే: ప్రకటించిన జైషే మహ్మద్!

  • ఉగ్రదాడిలో అసువులు బాసిన ఐదుగురు జవాన్లు
  • గ్రనేడి దాడి కారణంగానే వాహనంలో మంటలు
  • ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్న అధికారులు

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నిన్న జరిగిన ఉగ్రదాడి తమ పనేనని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది. ఈ ఉగ్రదాడిలో ఐదుగురు భారత జవాన్లు అసువులు బాశారు. జిల్లాలోని భీంబెర్ గాలి నుంచి సంగియోట్ వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులు కాగా, ఓ అధికారి గాయపడ్డారు. వెంటనే ఆయనను రాజౌరీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న వెంటనే అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జమ్ము) సహా సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. జిల్లాలోని రాజౌరి సెక్టార్‌లో నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ఉగ్రదాడి జరిగింది. కాల్పులు జరిగిన వెంటనే వాహనంలో మంటలు చెలరేగాయి. గ్రనేడ్ దాడి కారణంగా మంటలు అంటుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Related posts

గెలుపొందే వారికే టికెట్లు ఇస్తామన్నరాజస్థాన్ సీఎం గెహ్లాట్….!

Drukpadam

అమెరికాకు అక్రమ వలస యత్నం.. వృద్ధుడిలా నటిస్తూ పట్టుబడ్డ భారత యువకుడు!

Ram Narayana

నమ్మిన స్నేహితుడే పొడిచి చంపాడు …

Drukpadam

Leave a Comment