Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

థాయ్ లాండ్ లో గాంబ్లింగ్ చేస్తూ దొరికిపోయిన చికోటి ప్రవీణ్!

థాయ్ లాండ్ లో గాంబ్లింగ్ చేస్తూ దొరికిపోయిన చికోటి ప్రవీణ్!

  • థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ డెన్ గుట్టురట్టు
  • 80 మంది భారతీయుల అరెస్ట్
  • అరెస్టయిన వారిలో చికోటి ప్రవీణ్ తదితరులు
  • రూ.21 కోట్ల విలువైన గేమింగ్ చిప్స్ స్వాధీనం

కాసినో రంగంలో గ్యాంబ్లింగ్ కింగ్ గా గుర్తింపు పొందిన చికోటి ప్రవీణ్ థాయ్ లాండ్ లో పట్టుబడ్డాడు. పట్టాయాలోని ఓ హోటల్ లో రూ.100 కోట్లకు పైగా గ్యాంబ్లింగ్ జరుగుతోందన్న పక్కా సమాచారంతో థాయ్ లాండ్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 80 మంది భారతీయులు అరెస్ట్ అయ్యారు.

అరెస్టయిన వారిలో చికోటి ప్రవీణ్ కూడా ఉన్నాడు. అంతేకాదు, తెలంగాణలో నమోదైన ఈడీ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న మాధవరెడ్డి, మెదక్ డీసీసీబీ బ్యాంకు చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కూడా పోలీసులకు పట్టుబడ్డ వారిలో ఉన్నారు.

చికోటి ప్రవీణ్ థాయ్ మహిళలతో కలిసి గ్యాంబ్లింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ, హైదరాబాద్ నుంచి, దేశంలోని పలు ఇతర ప్రాంతాల నుంచి గ్యాంబ్లింగ్ పై ఆసక్తి ఉన్నవాళ్లను థాయ్ లాండ్ తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో వీరంతా భారత్ తిరిగి వచ్చేవారే కానీ… థాయ్ పోలీసులు దాడి చేయడంతో దొరికిపోయారు.

లగ్జరీకి మారుపేరులా నిలిచే ఆసియా పట్టాయా హోటల్ లో ఈ గ్యాంబ్లింగ్ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. గ్యాంబ్లింగ్ కోసం హోటల్ లోని కాన్ఫరెన్స్ హాల్ ను కూడా అద్దెకు తీసుకున్నట్టు గుర్తించారు. పోలీసులు ఈ దాడుల్లో రూ.21 కోట్ల విలువైన గేమింగ్ చిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో చికోటి ప్రవీణ్ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాను రాజకీయాల్లోకి వస్తుండడంతో, అడ్డుకునేందుకే తనపై ఇలాంటి చర్యలకు దిగుతున్నారని అప్పట్లో చికోటి ప్రవీణ్ వ్యాఖ్యానించాడు.

Related posts

ఇటలీ తీరంలో విషాద ఘటన… శరణార్థుల పడవ మునిగి 34 మంది మృతి!

Drukpadam

ఒకటీ రెండు కాదు… ఆ భారతీయ దంపతుల వద్ద ఏకంగా 45 పిస్టళ్లు లభ్యం!

Drukpadam

అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణ టెక్కీ సాయిచరణ్ మృతి!

Drukpadam

Leave a Comment