Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు …బీఆర్ యస్ లో ఆతర్మధనం…!

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు …బీఆర్ యస్ లో ఆతర్మధనం…!
-డీలా పడ్డ బీజేపీ …కాంగ్రెస్ లో కర్ణాటక జోష్
-కమ్యూనిస్టుల్లో బీఆర్ యస్ పై పెరుగుతున్న అసంతృప్తి
-43 స్థానాల్లో తమ పార్టీ ఫోర్స్ గా ఉందన్న షర్మిల
-బీఆర్ యస్ ఓటమే తమ లక్షమంటున్న బీఎస్పీ
-బీఆర్ యస్ ఓటమే ద్యేయంగా కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్న పొంగులేటి ,జూపల్లి

 

రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రావడంతో ఆపార్టీ ఫుల్ జోష్ మీద ఉండగా , బీఆర్ యస్ లో ఆతర్మధనం మొదలైంది . బీజేపీ డీలా పడింది . రాజకీయ చాణిక్యుడిగా పేరున్న బీఆర్ యస్ అధినేత కేసీఆర్ కర్ణాటక ఎన్నికల్లో మౌనంగా ఉండటంపై పలు సందేహాలు ఉన్నాయి. హంగ్ ఏర్పడి జేడీఎస్ నేత కుమారస్వామి కింగ్ మేకర్ అవుతారని అనుకున్నా అది జరగలేదు . బీఆర్ యస్ పోటీలో లేదు ఎవరికీ మద్దతు ఇవ్వలేదు . బీఆర్ యస్ ప్రారంభంలో ప్రతి సమావేశానికి హైద్రాబాద్ వచ్చి పాల్గొన్న కుమారస్వామి ఎందుకో తర్వాత కేసీఆర్ కు దూరమైయ్యారు . కేసీఆర్ కూడా మహారాష్ట్ర మీద పెడుతున్న ఫోకస్ కర్ణాటక మీద పెట్టడంలేదు …కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీ తో గెలవడంతో బీఆర్ యస్ కంగుతిన్నది .ఎక్కడ చూసిన ఇదే చర్చ …. త్వరలో తెలంగాణ లో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఇప్పటివరకు అటు ఇటు గా ఉన్న నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే బీఆర్ యస్ కు ఇబ్బంది తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి .

అందుకే బీఆర్ యస్ పార్టీ అత్యవసర సమావేశమా …?

కర్ణాటక ఎన్నికల జోష్ తో ఉన్న కాంగ్రెస్ ను కట్టడి చేయాలనీ బీఆర్ యస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు . అందుకు అనుగుణంగా పార్టీ ఎమ్మెల్యేలు , ఎంపీలు , ఎమ్మెల్సీలకు రాజకీయ పరిణామాలు వివరించడంతోపాటు దిశా నిర్దేశం చేయనున్నారు .అందుకే బుధవారం తెలంగాణ భవనం లో బీఆర్ యస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసింది. కేసీఆర్ చేస్తున్న వాగ్దానాలు అమలుకు నోచుకోకపోవడంపై ఆయా వర్గాల్లో అసంతృప్తి గూడు కట్టుకొని ఉంది. ధాన్యం ,మొక్కలు , కొనుగోళ్లలో జాప్యం, పంటలు నష్టపోయిన రైతులకు ,కౌలు రైతులకు పరిహారంలో ఆలసత్వం , ఉద్యోగుల సమస్యల పరిష్కరంలో మాటలకు చేతలకు పొంతన లేక పోవడం …ధరణి లో లోపాలను సరి చేయకపోవడం ,డబుల్ బెడ్ రూమ్ లు అందరికి ఇవ్వకపోవడం అందులో అవినీతి ,కేసీఆర్ చెప్పినట్లు దళిత బంధు మంజూరి కోసం ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు బీఆర్ యస్ కు మైనస్ గా మారె అవకాశం ఉంది. అందువల్లనే ఈసారి సిట్టింగ్ లలో సుమారు 25 నుంచి 40 మంది అభ్యర్థులను మార్చాలని ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు వస్తున్న వార్తలు సిట్టింగ్ లను కంగారు పెడుతుంది. దీనికి తోడు కమ్యూనిస్టుల మద్దతు ఉంటుందని అనుకున్న బీఆర్ యస్ కు అది నెరవేరేట్లు లేదు… దీనికి బీఆర్ యస్ వైఖరే కారణమని కమ్యూనిస్టులు అంటున్నారు . తాము కోరుతున్న సీట్లలో బీఆర్ యస్ అభ్యర్థులను ప్రకటించడంపై గుర్రుగా ఉన్నారు . బీజేపీ వ్యతిరేక పోరాటంలో బీఆర్ యస్ కలిసి వస్తుందని అనుకున్నప్పటికీ వారి వైఖరి అందుకు ఇరుద్దంగా ఉందని లెఫ్ట్ పార్టీలు అభిప్రాయం పడుతున్నాయి.

నిన్నమొన్నటివరకు బీఆర్ యస్ కు బీజేపీ నా లేక కాంగ్రెస్ నా అనుకున్నవారికి ఇప్పుడు కాంగ్రెస్ అనే అభిప్రాయం కలుగుతుంది. బీజేపీకి తెలంగాణ లో పెద్దగా ఉనికి లేదనే అభిప్రాయానికి బలం చేకూరింది . కాంగ్రెస్ కు ఇప్ప్పటికీ ప్రజల్లో బలం ఉంది. కర్ణాటకలో బీజేపీ గెలిస్తే కొంతవరకు బీజేపీ తెలంగాణాలో తన బలాన్ని పెంచుకునేది . కానీ ఇప్పడు ఆ సీన్ కనిపించడంలేదు . అధికారంలో ఉన్న కర్ణాటకలో తిరిగి అధికారంలోకి రావడానికి చేయని ప్రయత్నం లేదు … ప్రధాని , కేంద్ర నాయకత్వం అంతా అక్కడ మకాం వేసి పనిచేసినా బీజేపీని కన్నడ ప్రజలు కనికరించలేదు . దీంతో తెలంగాణ లో బీజేపీ ఢీలాపడిందని వార్తలు వస్తున్నాయి. పైగా ఇక్కడ నేతల మధ్య సఖ్యత లేకపోవడంపై అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది . దీంతో ఎక్కడ నేతలను ఢిల్లీ రావాలని అధిష్టానం కబురు చేసింది. దీంతో ఇప్పటికే ఈటెల రాజేందర్ ఢిల్లీ వెళ్లగా , బుధవారం బండి సంజయ్ వెళ్ళుతున్నారు .

వైయస్సార్ సంక్షేమ రాజ్యమే స్థాపనగా వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించారు . తమకు రాష్ట్రంలో 43 స్థానాల్లో పట్టు ఉందని తమ పార్టీ ఎవరితో పొత్తులుగాని , విలీనం కావటం కానీ జరిగేపని కాదని తేల్చి చెప్పారు .

బీఎస్పీ కూడా బీఆర్ యస్ ను ఓడించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఆపార్టీకి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ విస్తృత పర్యటనలు చేస్తున్నారు .

బీఆర్ యస్ సస్పెండ్ కు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు లు కేసీఆర్ ఓటమే లక్ష్యంగా కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్నారు . వారు మొదట్లో బీజేపీలోకి వెళతారని ప్రచారం జరిగిన మారిన రాజకీయ పరిస్థితిల్లో కాంగ్రెస్ లో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే బీఆర్ యస్ కు కొన్ని జిల్లాల్లో నష్టం జరుగుతుందనే అభిప్రాయాలు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు .

Related posts

సూడాన్‌లో గిరిజన తెగల మధ్య ఘర్షణ.. 200 మందికిపైగా మృతి!

Drukpadam

పార్టీలకు మునుగోడు ఫీవర్ …

Drukpadam

ఉచిత విద్యుత్‌పై వ్యాఖ్యల వివాదం.. రేవంత్ రెడ్డి ట్వీట్!

Drukpadam

Leave a Comment