Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎయిరిండియా విమానంలో కుదుపులు.. భయాందోళనలకు గురైన ప్రయాణికులు

ఎయిరిండియా విమానంలో కుదుపులు.. భయాందోళనలకు గురైన ప్రయాణికులు

  • విమానంలోని ఏడుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు
  • డాక్టర్, నర్స్ సహాయంతో చికిత్స అందించిన విమాన సిబ్బంది
  • ఎవరూ ఆసుపత్రిలో చేరలేదని డీజీసీఏ వెల్లడి

ఢిల్లీ – సిడ్నీ ఎయిరిండియా విమానం మంగళవారం భారీ కుదుపులకు గురి కావడంతో ఏడుగురు గాయపడ్డారు. బోయింగ్ 787 (VT-ANY) AI 302 విమానం ఢిల్లీ నుండి సిడ్నీకి బయలుదేరింది. ఈ విమానం ఒక్కసారిగా కుదుపులకు లోను కావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఏడుగురికి గాయాలైనప్పటికీ ఎవరూ కూడా ఆసుపత్రిలో చేరలేదని డీజీసీఏ వెల్లడించింది.

‘ప్రయాణ సమయంలో విమానం కుదుపులకు లోను కావడంతో ఏడుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అదే విమానంలో ప్రయాణిస్తోన్న డాక్టర్, నర్సు సహాయంతో విమాన సిబ్బంది ప్రథమ చికిత్సను అందించారు. సిడ్నీలోని ఎయిరిండియా ఎయిర్‌పోర్ట్ మేనేజర్ అక్కడ వైద్య సహాయాన్ని అందించే ఏర్పాటు చేశారు. ముగ్గురు ప్రయాణికులు అక్కడ వైద్య సహాయం తీసుకున్నారు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు’ అని సంబంధిత అధికారులు చెప్పారు.

Related posts

త్రాగునీటికి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టిన మంత్రి పువ్వాడ

Drukpadam

పవన్ కల్యాణ్ పై విజయవాడలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు…

Drukpadam

బెలారస్ లో రష్యా అణ్వాయుధాల పార్కింగ్.. !

Drukpadam

Leave a Comment