Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వరుడు నల్లగా ఉన్నాడని.. పందిట్లో పెళ్లిని రద్దు చేసుకున్న వధువు!

వరుడు నల్లగా ఉన్నాడని.. పందిట్లో పెళ్లిని రద్దు చేసుకున్న వధువు!

  • బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఘటన
  • ఊరేగింపుగా కల్యాణ మండపానికి చేరుకున్న వరుడు
  • వయసులోనూ తన కంటే పెద్దగా కనిపిస్తున్నాడన్న వధువు
  • నచ్చజెప్పినా పెళ్లికి ససేమిరా

పెళ్లికి ఊరేగింపుగా వచ్చిన వరుడ్ని చూసిన వధువు అతడ్ని వివాహం చేసుకునేందుకు నిరాకరించింది. చేసుకోనని మొండికేసింది. వరుడు తన కంటే నల్లగా ఉండడమే అందుకు కారణం. ఎవరు ఎంతగా నచ్చజెప్పినా ససేమిరా అనడంతో చివరికి పెళ్లి రద్దయింది. బీహార్‌ భాగల్‌పూర్‌లోని కహల్‌గావ్ ప్రాంతంలో జరిగిందీ ఘటన.

మరికాసేపట్లో పెళ్లనగా వరుడు ఊరేగింపుగా కల్యాణ మండపానికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వధువు కిట్టూ కుమారి కాబోయే భర్తను చూసి విస్తుపోయింది. అతడు తన కంటే నల్లగా ఉండడం, వయసులోనూ పెద్దవాడిగా కనిపిస్తుండడంతో ఆమె ముఖం పాలిపోయింది. అతడిని పెళ్లాడబోనని తేల్చి చెప్పింది. దీంతో మండపంలో కలకలం రేగింది. ఇరు కుటుంబాల వారు ఆమెకు నచ్చజెప్పి పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేసినా ససేమిరా అంది. వరుడి మెడలో దండ వేసి తిలకం దిద్దేందుకు నిరాకరించింది. చివరికి ఆమె పట్టుదలే నెగ్గింది. పెళ్లి రద్దయింది.

Related posts

హైదరాబాదులో రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

Drukpadam

కొత్త పార్టీ పెడుతున్న గద్దర్… పార్టీ పేరు ఇదే!

Drukpadam

ఆకలిని నియంత్రించడానికి ఉపయోగపడే ఐదు ఆహార పదార్థాలు ఇవీ!

Drukpadam

Leave a Comment