Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఎయిర్ పోర్టులో అధికారి పట్ల మోదీ తీవ్ర అసహనం… 

ఎయిర్ పోర్టులో అధికారి పట్ల మోదీ తీవ్ర అసహనం… 

  • ముగిసిన ప్రధాని మోదీ విదేశీ పర్యటన
  • ఢిల్లీలో విమానం దిగి వస్తుండగా ఎదురొచ్చిన అధికారి
  • వెనక్కి వెళ్లాలంటూ అసహనం వెలిబుచ్చిన మోదీ
  • వీడియో వైరల్

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే విమానం దిగి వస్తుండగా, ఓ అధికారి పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేయడం వీడియోలో రికార్డయింది.

మోదీ నడుచుకుంటూ వస్తుండగా, ఆ అధికారి నమస్కారం చేస్తూ మోదీకి సమీపానికి వెళ్లారు. దాంతో ఆగిపోయిన మోదీ… వెనక్కి వెళ్లాలని ఆ అధికారికి సూచించారు. మోదీ ఏం చెబుతున్నారో ఆ అధికారికి అర్థం కాకపోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. దాంతో మోదీ మరింత అసహనానికి లోనయ్యారు. బాగా వెనక్కి వెళ్లు అంటూ చేతులు ఊపుతూ సంజ్ఞలు చేశారు.

అక్కడున్న ఇతరులు ఆ అధికారిని వెనక్కి వచ్చి నిలుచోవాలని సూచించారు. ఆ వ్యక్తి వెనక్కి వచ్చి నిలుచోవడంతో, అప్పుడు మోదీ అందరికీ నమస్కారం చేసుకుంటూ ముందుకు కదిలారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ వీడియోపై విమర్శనాత్మకంగా స్పందించారు. “కొరియోగ్రఫీకి గురువు అనదగ్గ వ్యక్తి (మోదీ) ఏం చేశాడో చూడండి” అంటూ ఆ వీడియోను రీట్వీట్ చేశారు.

ప్రతి చోటా అందరి దృష్టి తనపై ఉండేలా చూసుకోవడంలో మోదీ దిట్ట అని, తాను తప్ప ఇంకెవరూ కనిపించకూడదని భావిస్తుంటారని విపక్ష నేతలు ప్రధానిపై విమర్శలు చేస్తుండడం తెలిసిందే.

Related posts

 కాలులోకి బుల్లెట్ దింపి నుహ్ అల్లర్ల నిందితుడిని పట్టుకున్న పోలీసులు

Ram Narayana

గ్రీస్ నుంచి నేరుగా బెంగళూరుకు వచ్చిన మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తలతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగం

Ram Narayana

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఉండాలి: రాష్ట్రపతి ముర్ము

Ram Narayana

Leave a Comment