Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి కాంగ్రెస్ లోకి జూన్ 8 లేదా ..12 న అని ప్రచారం …?

పొంగులేటి కాంగ్రెస్ లోకి జూన్ 8 లేదా ..12 న అని ప్రచారం …?
-రంగంలోకి రాహుల్ దూతలు …పొంగులేటి జూపల్లిలో టచ్ లోకి సునీల్ కనుగోలు
-పొంగులేటి ,జూపల్లి బీజేపీలో చేరడంలేదని స్పష్టం చేసిన ఈటెల
-బీఆర్ యస్ నేతల ఆరా …
-తమ చేరికలపై క్లారిటీ ఇవ్వని పొంగులేటి

రాష్ట్రంలో రాజకీయాలు చరవేగంగా మారుతున్నాయి. నిన్న ,మొన్నటివరకు ఏ పార్టీలో చేరేది చెప్పని పొంగులేటి , జూపల్లిలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతుంది. దీన్ని బలపరిచే విధంగా బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ మాటలు ఉన్నాయి. వారితో తాను నిరంతరం మాట్లాడుతున్నానని అయితే వారు తననే కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారని అన్నారు. అందువల్ల ఇప్పటివరకు కాంగ్రెస్ లో చేరకుండా వారిని ఆపగలిగినప్పటికీ ఇక సాధ్యం కాకపోవచ్చునను తన మనుసులో మాటలను బయట పెట్టారు . నిన్న ,ఈరోజు ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించిన పొంగులేటి హుటాహుటిన హైద్రాబాద్ బయలుదేరి వెళ్లారు . ఆయన కాంగ్రెస్ లో చేరికపై ఎలాంటి వార్తలు ఇంకా బయటకు రానప్పటికీ జూన్ 8 లేదా 12 తేదీల్లో కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో కలిసిన పొంగులేటి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తో భేటీ అయ్యారని ఆసందర్భంగా రాహుల్ గాంధీ తో మాట్లాడని సమాచారం.. దీంతో అధికార బీఆర్ యస్ వర్గాలు కూడా దీనిపై ఆరా తీస్తున్నాయి.

ఇద్దరు బలమైన నేతలు కాంగ్రెస్ లో చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కచ్చితంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. వీరితో పాటు మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరతారని సమాచారం అయిదు జూన్ రెండవవారంలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని పొంగులేటి ఇటీవల మీడియా సమావేశంలోనూ తన సన్నిహితుల దగ్గర చెప్పారు . ఖమ్మం జిల్లాలో పొంగులేటి కాంగ్రెస్ లో చేరితే జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారె అవకాశం ఉంది. దీంతో పొంగులేటి అడుగులపై అన్ని పార్టీలు కన్నేశాయి. కాంగ్రెస్ లో చేరుతున్నారంట ఇది నిజమేనా అంటూ కొందరు నిర్దారణ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. హైద్రాబాద్ వెళ్లిన పొంగులేటి ,జూపల్లి మరికొందరితో కలిసి ఢిల్లీ వెళతారా…? లేక హైద్రాబాద్ లో ముఖ్యులను కలుస్తారా … ? అనేది ఆసక్తిగా మారింది….

Related posts

బీజేపీ కుట్రలో ప్రవీణ్ కుమార్ భాగస్వామి: విరుచుకుపడిన టీఆర్ఎస్!

Drukpadam

పేదల డబుల్ బెడ్రూం ఇళ్లపై సెప్టెంబరు 4న విశ్వరూప ధర్నా: కిషన్ రెడ్డి

Ram Narayana

మీడియాతో చంద్రబాబు చిట్ చాట్- కీలక వ్యాఖ్యలు…

Drukpadam

Leave a Comment