Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రైలు ప్రమాదంలో ఏపీ వ్యక్తులు చనిపోయి ఉంటే రూ.10 లక్షల పరిహారం: సీఎం జగన్!

రైలు ప్రమాదంలో ఏపీ వ్యక్తులు చనిపోయి ఉంటే రూ.10 లక్షల పరిహారం: సీఎం జగన్…!

  • ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం
  • ప్రమాదం జరిగిన రోజున ఏపీకి చెందిన వారు 178 మంది ప్రయాణించినట్టు గుర్తింపు
  • వారిలో పలువురి ఆచూకీ గల్లంతు
  • అధికారులతో సీఎం జగన్ సమీక్ష

ఒడిశా రైలు ప్రమాదంలో 288 మంది వరకు మరణించిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ఏపీకి చెందినవారు 178 మంది వరకు ప్రయాణించినట్టు గుర్తించారు. వారిలో కొందరి ఆచూకీ తెలియరాలేదు.

ఈ నేపథ్యంలో, సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీ వాసులు ఎవరైనా మృతి చెందితే, వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.1 లక్ష చొప్పున ఇవ్వాలని స్పష్టం చేశారు. కేంద్ర సాయానికి అదనంగా రాష్ట్రం నుంచి కూడా పరిహారం అందించాలని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ, శ్రీకాకుళం జిల్లా వాసి ఒకరు చనిపోయారని సీఎంకు తెలియజేశారు. బాధితులకు మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Related posts

రసవత్తరంగా మారిన మా ఎన్నికలు :అధ్యక్ష బరిలో పలువురు ప్రముఖులు…

Drukpadam

ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ ఎవరైనా చేయవచ్చా..?

Drukpadam

భూదాన్ పోచంపల్లిని పర్యాటక ,సంస్కృత కేంద్రంగా అభివృద్ధి చేయాలి :బీజేపీ కొర్ కమిటీ సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి!

Drukpadam

Leave a Comment