Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

బీజేపీలో ఈటెలపై గుస్సా …!

బీజేపీలో ఈటెలపై గుస్సా …బయటకు రావాలని ఆయన సన్నిహితుల వత్తిడి…!
-చేరికల కమిటీ చైర్మెన్ గా ఉన్న ఈటెల
-చేరికలు లేకపోగా పార్టీని బలహీన పర్చేలా మాట్లాడుతున్నారని ఆరోపణలు
-బీజేపీలో అంతర్గత భేటీలో నాయకుల మధ్య పొసగని వైనం
-పునరాలోచనలో బీజేపీలో చేరిన పలువురు నేతలు

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ,కేసీఆర్ తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు బీజేపీలో పొసగటం కష్టంగా మారిందనే వార్తలు వస్తున్నాయి. ఆయన పై బీజేపీ నేతలు గుస్సా అవుతున్నారు.పార్టీని బలహీన పర్చేలా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయని పలువురు నేతలు అభిప్రాయ పడుతున్నారు. అంతర్గత సమావేశాల్లో ఆయనపై కొందరు నేతలు ఒక రేంజ్ లో ఫైర్ అయినట్లు సమాచారం . అధికార బీఆర్ యస్ లో ఉన్న ఈటెలపై భూకబ్జా ఆరోపణలతో కేసీఆర్ ఆయన్ను మంత్రి వర్గం నుంచి తొలగించారు.దీంతో ఆయన తనకు ఇష్టం లేకపోయినా అప్పడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీలో చేరారు . టీఆర్ యస్ నుంచి గెలిచినా హుజారాబాద్ అసెంబ్లీ సీటుకు రాజీనామా చేసి తిరిగి బై ఎలక్షన్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి అధికార బీఆర్ యస్ పై ఘనవిజయం సాధించారు . బీజేపీ మొదట్లో ఆయన సేవలు ఉపయోగించుకోవాలని అనుకున్నది .జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది . చేరికల కమిటీ చైర్మన్ గా చేసింది . కానీ ఇక్కడ నాయకులతో ఆయనకు పొసగటంలేదు .ముక్కు సూటిగా ఉండే ఈటెల మాటలను స్థానిక బీజేపీ నాయకత్వం పెడచెవిన పెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై అనేక సార్లు ఆయన బీజేపీ నేతలు అమిత్ షా ,జెపి నడ్డాలతో చర్చించారు . వారు కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదని ఈటెల తోపాటు ఆయన సన్నిహితులు అభిప్రాయంగా ఉంది. ఒక పక్క బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు గా పాదయాత్రలు పేరుతో తిరుగుతుండగా ప్రజాదరణ ఉన్నఈటెల లాంటి నేతలకు కాళ్లకు బంధాలు వేసినట్లు ఫీలౌతున్నారు .

చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల పార్టీలోకి ఎవరినైనా తీసుకోని వద్దామని ప్రయత్నిస్తే అది కేసీఆర్ కు ముందుగానే తెలుస్తుందని వాపోయారు . అన్ని పార్టీల్లో కేసీఆర్ కు కోవర్టులు ఉన్నారని తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు . ఇటీవల బీఆర్ యస్ నుంచి బహిష్కరణకు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు లను బీజేపీలో చేర్పించాలని ఈటెల గట్టి ప్రయత్నమే చేశారు . ఆయన నాకయత్వంలో బీజేపీ రాష్ట్ర నేతల బృందం ఒకటి ఖమ్మంలోని పొంగులేటి నివాసనానికి వెళ్లి చర్చలు జరిపింది . బీజేపీ నేతలు పొంగులేటి దగ్గరకు వెళ్లే విషయం తనకు తెలియదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు .దీంతో ఈ విషయంలో కూడా వారి మధ్య తేడాలు ఉన్నట్లు స్పష్టమైంది. తాను పొంగులేటిని , జూపల్లిని బీజేపీలోకి తీసుకోని వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశానని వారే తనకు కౌన్సిలింగ్ ఇస్తున్నారని బహిరంగంగా వ్యాఖ్యానించడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు . దీంతో ఈటెల కు బీజేపీ నేతలకు మధ్య గ్యాప్ మరింత పెరిగిందని అంటున్నారు .ఈటెల తోపాటు మరికొంత మంది నేతలు బీజేపీ తీరుపై అసంతృప్తి తో ఉన్నారని చర్చ జరుగుతుంది . కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన తరవాత బీజేపీలో చేరదామనుకున్న నేతలు కాంగ్రెస్ కు ముగ్గు చూపడం , బీజేపీలో లుకలుకలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయి…. ఈనేపథ్యంలో పార్టీ అగ్రనేతలు అమిత్ షా , జెపి నడ్డలు రాష్ట్రానికి వస్తున్నారు … చూద్దాం ఏమి జరుగుతుందో …

Related posts

రెడ్ల వర్గం నీకేం ద్రోహం చేసింది.. పోస్టులు ఎందుకు షేర్ చేస్తున్నారు?

Drukpadam

సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత కేంద్రానిది…కిషన్ రెడ్డి

Ram Narayana

కేంద్ర బడ్జెట్ పై వెరైటీగా స్పందించిన చంద్రబాబు ….

Drukpadam

Leave a Comment