Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

ఈ నెల 12న పొంగలేటి ప్రకటన.: మల్లు రవి 

ఈనెల 12 పొంగులేటి మీడియా సమావేశంకాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటన ..
ఆయనతోపాటు మరికొంత మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ గూటికి
ఇప్పటికి కాంగ్రెస్ నాయకులతో చర్చలు
కొంతమంది చిల్లర మాటలపై అసంతృప్తి
ఆవిషయాలు గమనించామని కాంగ్రెస్ నేతల వెల్లడి

మల్లు రవిని కలిసిన దామోదర రెడ్డి, జూపల్లి

రాజకీయ పునరేకీకరణలో భాగంగా చర్చలు జరిపినట్లు వెల్లడి

కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత లేదన్న పార్టీ నేత

బీఆర్ యస్ బహిష్కృత నేత మాజీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ఐదు నెలల 15 రోజుల నిరీక్షణ కాలానికి తెరదించనున్నారు . ఇప్పటికే కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొన్న పొంగులేటి వారి అభిప్రాయాల మేరకే నడుచుకుంటానని వెల్లడించారు . ప్రస్తతం హైద్రాబాద్ లో ఉన్నా పొంగులేటి కొంతమంది నాయకులతో మాట్లాడుతున్నారు. అందరు కలిసి సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంది. పోగులేటితోపాటు జూపల్లి మరికొంతమంది కూడ కాంగ్రెస్ లో చేరనున్నారు .తెలంగాణ జనసమితి నాయకులు ప్రొఫెసర్ కోదండరాం కూడ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతుంది. ప్రచారానికి తగ్గట్లుగానే కేసీఆర్ ను గద్దె దించేందుకు అవసరమైతే తన పార్టీని విలీనం చేస్తామని ప్రకటించారు . అందువల్ల ఆయన కూడ వీరితో కలిసే అవకాశం ఉంది .అయితే ఆయన విషయం నిర్దారణ కావాల్సి ఉంది…

పొంగులేటి నుంచి నెల 12 ప్రకటన: మల్లు రవి 

ఈ నెల 12వ తేదీన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశముందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. శనివారం మల్లు రవిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు కలిశారు. అనంతరం మల్లు రవి మాట్లాడారు.

రాజకీయ పునరేకీకరణలో భాగంగానే చర్చలు జరిగినట్లు చెప్పారు. నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డితోనూ చర్చిస్తామన్నారు. ఇప్పటికే ఆయనతో జానారెడ్డి చర్చించారన్నారు. జూపల్లితోను చర్చించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత లేదన్నారు.

Related posts

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై మరోసారి స్పందించిన అలీ!

Drukpadam

ఉద్ధవ్ థాకరే సంచలన నిర్ణయం …ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము కు మద్దతు!

Drukpadam

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందే …నినదిస్తున్న భారతావని …ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జాం …

Drukpadam

Leave a Comment